ఇంట్లో సువాసనలు వెదజల్లాలంటే..

Room Freshner

ఒక్కోసారి స్నానాల గదుల్ని టాయిలెట్లని ఎంతగా శుభ్రం చేసినా దుర్వాసన వస్తూనే ఉంటుంది. అది ఇతర గదులకు వ్యాపిస్తుంది. ఆ వాసన పోవడానికి ఖరీదైన ఫ్రెషనర్లే వాడాల్సిన పనిలేదు. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. పావుకప్పు వంటసోడాలో పావు కప్పు వెనిగర్‌, రెండు చెంచాల లిక్విడ్‌ డిష్‌ వాషర్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని పాత ఐస్‌ ట్రేలో వేసి ఆరనివ్వాలి. గట్టిగా అయ్యాక వీటిని స్నానాల గదిలో అక్కడక్కడా చల్లాలి. ఇలా చేస్తే దోమలు రావు. గది సువాసనభరితంగా ఉంటుంది. పావు కప్పు వంటసోడాలో చెంచా వెనిగర్‌, రెండు చుక్కల లావెండర్‌ నూనె కలిపి ఉండల్లా చేయాలి. వీటిని చిన్న చిన్న కాగితాల్లో వేసి గది మూలల్లో పెట్టాలి. ఇవి దుర్వాసనల్ని పీల్చుకుని సువాలసలు వెదజల్లుతాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/