ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల జోరు

కోవిడ్‌ దెబ్బతో అమెరికా ఆర్థిక వ్యవస్థ తగ్గుదలకు అవకాశం

Market-
Market-

ముంబై : కరోనా వైరస్‌ దెబ్బతో అమెరికా ఆర్థిక వ్యవస్థ 6.5శాతం తగ్గుదలను చవిచూసే అవకాశమున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా వేసిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాకిచ్చాయి.

దీంతో అమెరికా నుంచి ఆసియా వరకూ మార్కెట్లలో విక్రయాలు జోరందుకున్నాయి.

ఫలితంగా దేశీయంగానూ ఆందోళనలకు లోనైన ఇన్వెస్టర్లు సమయం గడచేకొద్దీ అమ్మకాలకు దిగారు. వెరసి సెన్సెక్స్‌ 709 పాయింట్లుపడిపోయి 33,538వద్ద నిలిచింది.

అదేవిధంగా నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ నిఫ్టీ కూడా 214 పాయింట్లు క్షీణించి 9902 వద్ద ముగిసింది. అటుసెన్సెక్స్‌ 34వేల పాయింట్లు, ఇటు నిఫ్టీ 10వేల పాయింట్ల మైలు రాళ్ల దిగువన స్థిరపడ్డాయి.

2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరవచ్చని ఫెడ్‌ అంచనా వేసింది. అయితే అవసరమైతే ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలియచేసిందది. ఇప్పటికే వడ్డీరేట్లను నామమాత్ర స్థాయికి తగ్గించడంతో యథాతథ రేట్లను అమలు చేసేందుకు నిర్ణయించింది.

కాగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 34,219-33,480పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూడగా, నిఫ్టీ కూడా 10,112-9,885పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల, జి, ఎస్‌బిఐ, సన్‌ఫార్మా, టాటా మోటార్స్‌, మారుతి సుజుకి, ఐషర్‌, బజాజ్‌ఫైనాన్స్‌, గ్రాసిమ్‌ ఇండియా, వేదాంత 9శాతం నుంచ 3.5శాతం మధ్య క్షీణించాయి.

అయితే ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 4.4శాతం పెరిగింది. హీరోమోటోకార్ప్‌, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌ 0.7శాతం స్థాయలో బలపడ్డాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/