మున్సిపల్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ హవా

trs party
trs party

హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. మొదటి గంటలోనే పలు చోట్ల టిఆర్‌ఎస్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. వర్ధన్నపేట మున్సిపల్‌లో 2, 6, 8, 10 వార్డులు టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అలాగే డోర్నకల్‌ 11వార్డు, హుజుర్‌నగర్‌ మున్సిపాలిటీలో 2 వార్డులు, అందోల్‌లో 2వార్డుల్లో టిఆర్‌ఎస్‌ గెలుపొందింది. ఇంకా బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో తొలి మూడు వార్డులను టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మూడు వార్దుల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులపైనే టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. మొదటి వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి లావణ్యపై టిఆర్‌ఎస్‌ అభ్యర్థి తాస్లిం పిర్‌దోష్‌ విజయం సాధించారు. రెండో వార్డులో రాములుపై మోతీలాల్‌ విజయం సాధించగా..మూడో వార్డులో వహీంపై నేహ సుల్తానా విజయం సాధించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/