ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఆమోఘం

రంగారెడ్డి: మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా తాండూరు ఆర్యవైశ్య భవన్‌లో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీగా ఉండడం బీజేపీ నేత రాంచందర్‌రావుకు ఇష్టం లేదని.. దీంతో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు తిరస్కరించారని అన్నారు. దేశంలో అడ్వకేట్లకు రూ.100 కోట్లతో వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్ర తెలంగాణేనన్నారు. ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అమోఘమన్నారు. ప్రభుత్వం కరోనా సమయంలో రూ.25 కోట్లు సాయం అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేదని గుర్తు చేశారు.


రాంచంద్‌రావు ఆరేళ్లలో అడ్వకేట్లకు చేసిన సేవ ఏంటో చెప్పాలన్నారు. తెలంగాణతో తాండూరు రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిందన్నారు. న్యాయవాదులు తమ ఓటును వాణీదేవికి వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రి తో పాటు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/