కేంద్రం వద్దకు ఏపి మండలి రద్దు తీర్మానం

శాసనసభ తీర్మానాన్ని న్యాయ, హోం శాఖలకు పంపిన రాష్ట్ర ప్రభుత్వం

cm jagan
cm jagan

అమరావతి: ఏపి శాసనమండలి రద్దు తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. నిన్న రాత్రే తీర్మానం ప్రతిని, ఓటింగ్ వివరాలకు సంబంధించిన పూర్తి అంశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శాసనసభ సచివాలయం పంపింది. శాసనసభ సచివాలయం నుంచి బిల్లులకు సంబంధించిన అంశాలను అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం.. ‘మండలి రద్దు’ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి పంపింది. కేంద్ర న్యాయశాఖతో పాటు హోంశాఖకు ఈ తీర్మానం అందింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇందుకు సంబంధించిన ప్రతిని పంపింది. శాసనమండలిని రద్దు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అనంతరం రాష్ట్రపతి కూడా ఆమోదించి, నోటిఫికేషన్‌ జారీ చేస్తే మండలి రద్దు అవుతుంది. అప్పటివరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రతి బిల్లూ మండలికి వెళ్లాల్సిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/