ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 ని ఏకపక్షంగా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన స్రవంతిలో ఉన్న పార్టీలను, వేర్పాటువాద పార్టీలను దేశ వ్యతిరేక పార్టీలుగా చూడటం మానేయాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి అమల్లోకి తేవాలని ట్విట్టర్ వేదికగా చిదంబరం డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రజల హక్కులను పునరుద్ధరించడానికి జమ్మూలోని ప్రధాన స్రవంతి ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావడాన్ని ఆయన చిదంబరం స్వాగతించారు. భారత ప్రజలు కూడా వారి డిమాండ్‌ను స్వాగతించాలని పిలుపునిచ్చారు. జమ్ముకశ్మీర్ ప్రజల హక్కులను పునరుద్ధరణ కోసం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి కూడా వెన్నుదన్నుగా ఉంటుందని చిదంబరం ప్రకటించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/