రెడ్‌ జోన్‌ ఎక్కడా ప్రకటించలేదు

హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి

Swetha Mohanty, Hyderabad District Collector
Swetha Mohanty, Hyderabad District Collector

Hyderabad: హైదరాబాద్‌ జిల్లాలో రెడ్‌ జోన్‌ ఎక్కడా ప్రకటించలేదని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి అన్నారు. రెడ్‌ జోన్‌ ఉన్నట్లు మార్ఫింగ్‌ చేసిన ఫ్లెక్సీలు పెడుతున్నరని, అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కమిషన్‌ పరిధిలో రెడ్‌ జోన్లు లేవని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న ప్రచారం అవాస్తవమన్నారు.

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడా రెడ్‌ జోన్‌లు లేవని స్పష్టం చేశారు.

చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు కొన్ని ఏరియాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్నాయని అవి అవాస్తవమని ఆయన చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారని సీపీ తెలిపారు.

అయితే కొందరు దఫదఫాలుగా కుటుంబ సభ్యులతో బయటకు వస్తున్నారు. అలాంటి వారి వల్లనే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు.

కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని సీపీ కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/