మన జీవనశైలే కారణం

ఆరోగ్య సంరక్షణపై అవగాహన అవసరం

Work Strain-
Work Strain-

వ్యాధులకు ప్రధానకారణం మన జీవనశైలే. నిజానికి మన శరీరం మనతో మాట్లాడుతుంటుంది. కానీ మనమే వినం. ఆకలి వేస్తుంటే టీ కాఫీల తో సముదాయిస్తాం.

నిద్రనీ బలవంతంగా ఆపేస్తాం. తిండీ, నిద్రలకి నిద్దిష్ట సమయం కేటాయిం చుకోవడం మానేశాం. దాంతో జీవగడియాం దెబ్బతిని శరీర వ్యవస్థలన్నీ గాడి తప్పుతున్నాయి. ఫలితమే రోగాలు. మధుమేహం, థైరాయిడ్‌.. పిలవకుండానే పలుకుతున్నాయి.

కేన్సర్‌ నేనున్నా అంటోంది. నరాలు, కండరాల నొప్పులు, ఊపిరి తిత్తుల సమస్యలు వరస కడుతున్నాయి.

ఇక, మానసిక వ్యాధులు సరేసరి. ఇందుకోసం ఆహారంలో మార్పు ల్ని సూచించడమే కాదు, రోగులకి ప్రత్యేక మూలికల్ని మేళవించి వండించిన ఆహారాన్నీ అందిస్తుంది.

ఎందుకంటే ఆహారమే శక్తివంత మైన ఔషధం. ఖనిజాలూ విటమిన్ల వల్ల రోగాల సంఖ్య మెరుగుతుంది.

ఐరన్‌ లోపం వల్ల రక్తంలో ఆక్సి జన్‌ తగ్గి మెదడు పనితీరు దెబ్బతింటుంది. దాంతో ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతాయి. వాటి ప్రభావం అన్ని శరీరభాగాల మీదా పడుతుంది.

ఆ లోపాల్ని ఆహారంతోనే తగ్గించాలిగానీ సప్లిమెంట్లతో కాదు అంటుంది వైద్యశాస్త్రం. సృష్టిలో ఎన్నో జీవ్ఞలున్నా యి. వాటిని రోగాలు రావా వస్తాయి కదా.

కానీ అవి వాటంతటవే తగ్గించుకుంటాయి. ఏ మొక్కనో వాసన చూస్తాయి. మట్టినో రుద్దుకుంటాయి.

నీళ్లలో మునకలేస్తాయి. లేదంటే ఉపవాసం చేస్తాయి. మనిషి కూడా అంతే. ప్రకృతిలో భాగమే. సకల ప్రాణికోటికి ఆధారమైన పంచ మహాభూతాలతోనే మన శరీరమూ నిర్మితమైంది.

ఇవన్నీ కలిసి ఆరోగ్యానికి కీలకమైన జీవక్రియని ప్రభావితం చేస్తాయి. అవి సరిగ్గా లేనప్పుడే రోగా లు వస్తాయి. శరీరం వీలైనంతవరకూ దానికదే తగ్గించుకుంటుంది.

లేదంటే ముల్లుని ముల్లుతోనే తీయాలన్న ప్రకృతి సూత్రాన్ని అనుసరించాలి. ఈ పనే చేస్తుంది.

వెన్నెముక, మెడ, కీళ్లనొప్పుల్నీ పక్షవాతంతో వంకర తిరిగిన భాగాల్ని సరిచేసేందుకు ఔషధ మూలికల తో నిండిన వేడినీటి స్నానాలనీ చేస్తుంటాం.

మన జీవనశైలే కారణం
Strain

జీవక్రియని పెం చి రక్తప్రసరణ సమస్యల్నీ క్యాలరీల్నీ కరిగించే పరారుణ కాంతి స్నానాన్నీ, శరీరంలోని మలినాల్ని తొలగించడంతోబాటుకొవ్వుని కరిగించేందుకు మట్టి స్నానాన్నీ ఇలా ఎన్నో రకాల స్నానాలతో వ్యాధుల్ని తగ్గిస్తుంది.

ఐదువేల ఏళ్ల క్రితం పుట్టిన అద్భుత మైన వైద్యం ఆయుర్వే దం. మనిషి ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందు కు కొందరు మునులు ఇంద్రుణ్ణి ప్రార్థిస్తే చెప్పిన వేదసూత్రాలే ఆయుర్వేదం అని చెబుతారు సంప్ర దాయ వాదులు.

అందుకే దీన్ని పంచమవేదం అని అంటారు. సకరవ్యాధులకీ సర్వాంగ ఔషధం. తల నుంచి పాదాల వరకూ మూలికా తైలాన్ని పట్టించి చేసే ఈ మర్దనతో నిస్త్రా ణంగా మారిన శరీరం సేదతీరుతుంది.

పరిమళ తైలాలతో చేసే ఈ మర్దనతో నరాలన్నీ సాంత్వన పొందుతాయి. రక్తప్రసరణ మెరుగవుతుంది. శరీరం గాల్లో తులుతున్నంత హాయిగా అనిపి స్తుంది. నిద్రాదేవిని ఆవాహన చేసుకుంటుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/