విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలి

Vijayasai Reddy
Vijayasai Reddy

ఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. అఖిలపక్షం సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. మహిళా బిల్లు, బీసి రిజర్వేషన్లు వంటి అంశాలను సైతం అఖిలపక్షం భేటీలో లేవనెత్తినట్లు చెప్పారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని వృథా కాకుండా చేయగలిగామన్నారు. ప్రాజెక్టు సంబంధించిన రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశామాన్నారు. రాష్ట్రంలో 7 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్ల తెలిపారు. మరోవైపు యూపీఏ హయంలోనే వైఎస్‌ఆర్‌ అధినేత జగన్‌ను 16 నెలలు జైల్లో ఉంచారు. ఇప్పుడు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని చిదంబరం విషయంలో కోరడం కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/