సచివాలయ తరలింపుపై సర్కార్‌ వేగవంతం

Telangana secretariat
Telangana secretariat

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం సచివాలయ తరలింపు ప్రక్రియను వేగవంత చేసింది. హైకోర్టులో కేసు నడుస్తున్నా.. సచివాలయ తరలింపుపై సర్కార్ ముందుకెళుతోంది.బీఆర్కే భవన్‌లోని లిఫ్ట్‌ల కోసం రూ. 90 లక్షలు కేటాయించింది.పరిస్థితి అనుకూలిస్తే మరో 10, 15 రోజుల్లో సచివాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన కసరత్తును సెక్రటేరియట్‌లోని సాధారణ పరిపాలన శాఖ చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో ఫైళ్లను బీఆర్కే భవన్‌కు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. బూర్గుల భవంతిలో ఉన్న ఒకటి రెండు మినహా అన్ని శాఖలను ఖాళీ చేశారు. వచ్చే సోమవారం నాటికి బీఆర్కే మొత్తం ఖాళీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/