పసిడి ధరలు భారీగా పెరగొచ్చు: ఎందుకంటే?

gold
gold

న్యూఢిల్లీ : పసిడికి భారతీయులకూ మధ్య అనుబంధాన్ని ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. పూరిగుడిసెలో ఉన్న వాళ్ల దగ్గర నుంచి కోట్లలో తులతూగే వాళ్ల వరకూ అందరికీ బంగారం కావాల్సిందే. ఎందుకంటే మనకు ఇది లక్ష్మితో సమానం అంతర్జాతీయంగా అనేక అంశాలను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ముఖ్యంగా బంగారం వినియోగం 150 టన్నులకుపైగా పెరిగింది. అయితే అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం తలనొప్పిగా మారింది. నెలలు నెలలుగా సాగుతున్న ఈ ట్రేడ్‌వార్‌ ఓ కొలిక్కి వచ్చే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా వాల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం 2017లో 4,159.9 టన్నులుగా ఉన్న బంగారం వినియోగం 2018లో 4345.10టన్నులకు పెరిగింది. వీటిని విశ్లేషించి చూస్తే బంగారానికి భారీగానే డిమాండ్‌ పెరుగుతూ వస్తుంది. ఇదంతా ఫిజికల్‌ గోల్డ్‌. ఇదే సమయంలో ఇటిఎఫ్‌ల రూపంలో కూడా ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. ఇది సేఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌. ఎందుకంటే ఇటిఎఫ్‌ల కొనుగోలు, అమ్మకం చాలా సులువు. దీనికి చార్జీలు పెద్దగా ఉండవు. తరుగు, కూలీ వంటి అనవసరపు ఖర్చు అసలే ఉండదు. అందుకే పెద్ద ఇన్వెస్టర్లంతా ఇటిఎఫ్‌ల వైపే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ఇటిఎఫ్‌లకు తోడు కేంద్రం ఈ మధ్య గోల్డ్‌ బాండ్స్‌ను ప్రవేశపెట్టింది. బంగారాన్ని మనం వాళ్ల వద్ద దాచుకోవడం వల్ల 2.5శాతం వడ్డీని ఇస్తున్నారు. గోల్డ్‌రేట్‌ అప్రిషియషన్‌కు ఇది అదనం. జ్యుయెల్లరీ రూపంలో ఉన్న బంగారాన్ని కేవలం లాకర్లలో దాచుకుని ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ను పరిగణిలోకి తీసుకోవడం మంచిది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ స్పాట్‌ గోల్‌డ1310 డాలర్ల వరకూ పలుకుతోంది. ఇది నెమ్మదిగా 120డాలర్ల వరకూ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వివిధ అసోట్‌ క్లాసులు నీరసించినప్పుడు గోల్డ్‌కే డిమాండ్‌ అధికంగా ఉంటుంది. దేశీయంగా ప్రస్తుతానికి ఎంసిఎక్స్‌లో 10 గ్రాములు ఫ్యూర్‌గోల్డ్‌ రూ.32,150 వరకూ ఉంది. ఇది రూ.33,500-34,000మధ్యకు చేరొచ్చని బులియన్స్‌ ఎక్స్‌ఫర్ట్స్‌ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడున్న ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్‌లో భాగంగా గోల్డ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే రూ.100పెట్టుబడిలో గోల్డ్‌కు 5నుంచి 10శాతం వరకూ పోర్ట్‌ఫోలియోలో కల్పించవచ్చు.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/