పేదలకు సెంటూ స్థలం కూడా ఇవ్వడం లేదు

ప్రజల నుంచి భూములు బలవంతంగా లాక్కుంటున్నారు

devineni uma
devineni uma

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాజభవనం లాంటి భవంతిలో ఉంటూ పేదలకు సెంటూ స్థలం కూడా ఇవ్వడం లేదని టిడిపి నేత మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కొత్తూరు, తాడేపల్లి ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. టిడిపి కేంద్ర కార్యలయంలో ఆయన మాట్లాడుతూ..పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నమనే పేరుతో 450 ఎకరాల భూమిని వైఎస్‌ఆర్‌సిపి నేతలు కాజేశారని దేవినేని ఆరోపించారు. ఇదే విషయంపై టిడిపి నేత బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ..ఇళ్ల స్థలాల పేరుతో పెనమలూరు నియోజకవర్గంలో 130 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయకుండా కొత్త డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/