కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టనున్నారు. కాగా ఈ ర్యాలీకీ అనుమతి ఇవ్వడం కుదరదని తెలంగాణ డిజిపి మహేందర్‌రెడ్డి చెప్పారు. కాగా డిజిపినీ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ రెడ్డి, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి కలిశారు. అయితే సభను నిర్వహించుకోండి కానీ, ర్యాలీకీ మాత్రం అనుమతి ఇవ్వలేమని డిజిపి స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా ఈ సందర్భంగా స్పందించిన సిపి అంజనీకుమార్ నగరంలో రోడ్లపై ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని, సమావేశాలు నిర్వహించుకోచ్చు కానీ ఆయా పార్టీల కార్యాలయాల్లో మాత్రమే నిర్వహించుకోవాలని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/