కుప్ప కూలిన యుద్ద విమానం

flight
flight

ఇస్లామాబాద్‌ : ఇరాన్‌, అజర్‌బైజన్‌ సరిహద్దుల్లో బుధవారం ఒక యుద్ధ విమానం కుప్ప కూలింది. పైలెట్‌ జాడ తెలియలేదు. ఈ విషయాన్ని స్ధానిక టెలివిజన్‌ ఛానళ్ళు ప్రసారం చేశాయి. సబలాన్‌ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మూడు హెలికాప్టర్లు, సహాయ బృందాలు పైలెట్‌ కోసం గాలిస్తున్నాయని పేర్కొన్నాయి. యుద్ధ విమానం కుప్ప కూలిన నేపథ్యంలో పైలెట్‌ వైమానిక స్థావరాన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు సమాచారముందని తెలిపాయి. ప్రమాదానికి లోనైన విమానం ఇటీవలే మరమ్మతులు పూర్తి చేసుకుంది. ఈ విమానాన్ని పరీక్షించేందుకు పైలెట్‌ టబ్రిజ్‌ వైమానిక స్థావరం నుండి దానిని తీసుకు వెళ్ళాడు. ప్రమాదం జరగడానికి గల కారణంపై దర్యాప్తు జరుగుతున్నదని అధికారులు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/