నేనే తీసుకెళ్లి వాళ్ల దేశంలో వేసి వస్తా

philippines trash ship
philippines trash ship

మనీలా: రీసైక్లింగ్‌ వ్యర్థాల పేరుతో కెనాడా పంపిన చెత్తను ఫిలిప్పీన్స్‌ వాపస్‌ పంపించింది. అయితే కెనడా 2013-14నుండి రీసైక్లింగ్‌ వ్యర్థాల పేరుతో గృహ వ్యర్థాలను ఫిలిప్పీన్స్‌కు తరలిస్తుంది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్‌ అధికారులు కొన్నాళ్ల కిందటే గుర్తించారు.దీంతో ఆ చెత్తను వాపస్‌ తీసుకోవాలని ఆ దేశ అధ్యక్షుడే రంగంలోకి దిగి కెనడాను హెచ్చరించారు. నేనే తీసుకెళ్లి వాళ్ల దేశంలో వేసి వస్తా అంటూ రోడ్రిగో పేర్కొన్నారు. దీంతో కెనడా దిగొచ్చి ఆ చెత్తను వాపస్‌ తీసుకోవడానికి అంగీకరించింది. ఈ సందర్భంగా ఈ చెత్తను దాదాపు 60కి పైగా కంటైనర్లలో పెట్టి జాగ్రత్తగా ఒక నౌక ద్వారా కెనడాకు తిరిగి పంపింది.1500 టన్నుల చెత్తను 69 కంటైనర్లలో నింపి వాంకారో ఓడ రేవులోని ఒక నౌకలోకి ఎక్కించారు. శుక్రవారం ఆ నౌక కెనడాకు పయనమైంది. దాదాపు 20 రోజుల తర్వాత అది కెనడాకు చేరుకొంటుంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/