కరోనా పై అధికారిక యాప్‌ తీసుకువచ్చిన కేంద్రం

ఆరోగ్యసేతు యాప్‌ కు రూపకల్పన చేసిన ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ

corona virus
corona virus

దిల్లీ: దేశలో కరోనా విజృంభిస్తుంది. ఈ వ్యాది సోకిన వారు ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఎందుకంటే తాజాగా తేలిన కొన్ని కేసులలో కొందరికి ఎటువంటి లక్షణాలు కూడా కనపడలేదు. ఇప్పటికే దేశంలో సుమారు రెండువేల మందికి ఈ వ్యాధి సోకింది. కరోనా సోకిన వారిని గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ ను తీసుకువచ్చింది. దీనిపేరు ఆరోగ్యసేతు. ఇందులో ఎప్పటికపుడు కరోనా సోకిన వివరాలను ఇందులో నిక్షిప్తం చేస్తారు. ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసకుంటే… కరోనా సోకిన భాధితుడు మీ సమీపంలోకి వచ్చినట్లయితే వెంటనే ఇది మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల మీరు కరోనా ముప్పునుంచి తప్పించుకోవచ్చు. మీ ఫోన్‌ లొకేషన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా తగిన సమాచారం అందిస్తుంది. ఈ యాప్‌లోని యూజర్‌ డేటా కేంద్ర ప్రభుత్వం తో మాత్రమే పంచుకుంటారని, థర్డ్‌ పార్టీతో పంచుకోవడం ఉండదని, అందువల్ల ఇది సురక్షితం అని అధికారులు అంటున్నారు. ఈ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఉచితంగా అందిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/