తదుపరి విచారణ ఏప్రిల్ 9న
హజరయిన రాజగోపాల్, మన్మోహన్‌సింగ్

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ, ఈడీ కోర్టులో నేడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. నేటి విచారణకు కేసులో ప్రదాన నిందుతులు అయినటువంటి మన్మోహన్‌సింగ్, రాజగోపాల్ హజరయ్యారు. వారిని విచారించిన అనంతరం న్యాయస్థానం ఈ కేసుకు సంబందించి తదుపరి విచారణను ఏప్రిల్ 9న చేపడతామని తెలిపింది. కాగా ఈ కేసులో నిందితులుగా గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి, శ్యామ్ ప్రసాద్‌లు కూడా హజరయ్యారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/