కష్టపడే స్వభావం తప్పనిసరి

CAREER
CAREER

పదివేలసార్లు తన ప్రయోగం విఫలమైనా విసుగు చెందక తిరిగి తన ప్రయత్నాన్ని కొనసాగించి తుదకు ప్రపంచానికే వెలుగు ప్రసాదించిన థామస్‌ అల్వా ఎడిసన్‌ సక్సెస్‌కు కారణం ‘హార్డ్‌వర్క్‌ అని చెప్పక తప్పదు. ఆయన ఉద్దేశం లో కష్టపడటాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు. విజ యం ఎవరికైనా తేలికగా రాదు. అది ఎంతో ఓపికని, త్యాగాన్ని కోరుతుంది. మీరు విజయం సాధించాలంటే నిరంతరం హార్డ్‌వర్క్‌ చేస్తూనే ఉండాలి. మీరు కష్టపడు తున్నది మీ కోసమే కాని ఇతరుల కోసం కాదు.

మీ కోసం మీరు కష్టపడటాన్ని మించిన ఆనందం ఏముంటుంది? రోజుకు పధ్నాలుగు గంటలు కష్టపడ్డా అది మన సంతృప్తి కోసమేనని తెలుసుకోవాలి. గమ్య సాధన కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఓ వర్క్‌ హాలిక్‌లా కష్టపడుతూనే ఉండాలి. వర్షం కురుస్తున్నా 47 డిగ్రీల ఎండ కాస్తున్నా కష్టపడుతూనే ఉండాలి. ఈ ప్రకృతిలో అనంతమైన ఆహారపదార్థాలు వ్ఞన్నాయి. ప్రకృతి ఆహారాన్ని మన నోట్లో పెట్టదు. దానిని నోట్లోకి తీసుకోవడం మనవంతు. అందుకు నిరంతరం కష్టపడు తూనే ఉండాలి. మీకు తెలుసా వెబ్‌స్టర్‌ నిఘంటువ్ఞను సమర్పించడానికి వెబ్‌స్టర్‌కి 36 సంవత్సరాలు పట్టాయి. కాబట్టి కష్టాన్ని మించిన ప్రతిఫలం లేదని తెలుసుకోండి.

ప్రతి మనిషికి తన గమ్యసాధనలో ఎన్నో అవరోధాలు ఎదురవ్ఞతాయి. అవరోధాలు అతి సహజం. అవరోధాలు ఎదుర్కోలేని వ్యక్తులు ఎన్నటికీ రాటుదేలలేరు. చరిత్రని ఒకసారి పరికించి చూస్తే గొప్పగొప్పవారంతా అవరోధాలను ఎదుర్కొన్నవారే! ప్రస్తుతం మనం ఎక్కి తిరుగుతున్న కారుని కనిపెట్టిన హెన్రీపోర్ట్‌ ఎన్నోసార్లు కారు తయారీలో విఫలమయ్యారు. మనుసులు తిరిగే కారుని తయారు చేయాలన్న అతడి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఇంజనీర్లంతా చేతులెత్తేశారు. అయినా అతడు మొండిగా ప్రయత్నాలు చేయసాగాడు. ఆఖరికి ీరోడ్డు మీద కదిలే గతికి చిహ్నమూన కారుని కనిపెట్టడంలో సక్సెస్‌ అయ్యాడు.

ఆనాడు అతడు కనుక నిరాశతో, నిస్పృహతో ప్రయత్నాలు మానేస్తే, నేడు ఇంత చక్కటి సౌకర్యంతో, సుఖంగా ప్రయాణించే కారు మన ముందు వ్ఞేంది కాదు. అవరోధాలు అనేవి మనకు శక్తిని ఇచ్చి ముందుకునడిపిస్తాయి. ఉదాహరణకు మీరొక నదిలాంటి వారు. గలగలపారే ఆ నదికి లరోధాలు ఆనకట్టల్లాంటివి. అప్పుడు ఏమవ్ఞతుంది? తాత్కాలికంగా ఆనకట్ట ధాటికి నీళ్లు ఆగినా కొంతకాలం తర్వాత రెట్టించిన వేగంతో ఆనకట్టని దాటి పొంగి పొరలుతాయి. అలాగే అవరోధాల వల్ల మరింత శక్తిని పుంచుకొని విజయం సాధిస్తాం.

కాబట్టి ప్రతి పొరపాటుని ఒక పాఠంగా తీసుకోండి. అందువల్ల మీ గమ్యసాధనలో జాగ్రత్తగా వ్ఞండటం అలవాటవ్ఞతుంది. పుల్లయ్య అనే యువకుడికి అందుకోసం యాభైవేలు కెమెరాలకు, ఇతర సామానులకు పెట్టుబడి పెట్టాడు. అందుకోసం యాభైవేలు కెమెరాలకు, ఇతర సామానులకు పెట్టుబడి పెట్టాడు. ఫొటోస్టూడియో స్థాపించి రెండు నెలలు అవ్ఞతున్నా, ఒకడూ, ఒకడూ, అరా తప్ప కష్టమర్లు రాలేదు. దాంతో మరో నాలుగు నెలలకు అతడు దివాళా తీశాడు. ఆ యాభైవేల రూపాయల ఎక్విప్‌మెంట్‌ అమ్మేయగా, పదివేలు వచ్చాయి. నికరంగా నలభైవేలు నష్టం. ఆ తర్వాత ం చేయాలో తోచక చాలా రోజులు తిరిగాడు. తర్వాత పొట్ట కోసం కూరగాయల బండిపెట్టాడు. దానిపై వచ్చే లాభం పొట్ట నింపడానికి బొటాబొటిగా సరిపోయేది.

అతడు ఇంకొంత కష్టపడి కొద్దిడా వెనుక వేయసాగాడు. అలా నాలుగేళ్లశ్రమ అనంతరం ఇరవై వేలు సంపాదించాడు. ఈసారి తను మొదటిసరి చేసిన తప్పులు ఎక్కడ చేశాడో ఆత్మవిమర్శ చేసుకొని మరి కొద్ది మార్పులు చేశాడు. ఫొటో స్టూడియోలు ఎక్కువ లేని చోట స్టూడియో తెరిచాడు. తను పర్సనల్‌గా ఇంటికి వచ్చి ఫంక్షన్స్‌ ఫొటోలు కూడా తీస్తానని, స్కూళ్లకు, కాలేజీలకు, దుకాణాలకు, మ్యారేజి హాళ్లకు విజిటింగ్‌ కార్డులు పంచాడు. అలా ప్రతి కోణంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు సిటీలో వ్ఞన్న ఫొటో స్టూడియోలోకెల్లా బిజి స్టూడియో అయింది. అలా కూరగాయలు అమ్ముకునే అతడు ఐదు సంవత్సరాలలో ఐదు లక్షలు వెనకేశాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/