విద్యా శాఖా మంత్రి రాజీనామా చేయాలి

kodandaram
kodandaram


హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని టిజెఎస్‌ అధినేత కోదండరాం డిమాండ్‌ చేశారు. చనిపోయిన విద్యార్ధులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, సియం కేసిఆర్‌ తీరు రోమ్‌ చక్రవర్తిలా ఉందని ఆరోపించారు. అరెస్టులు చేస్తామని, న్యాయం చేయం అంటున్నారని కోదండరాం దుయ్యబట్టారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్ధుల ఆత్మహత్యలను నిరసిస్తూ విపక్షాలు ఇంటర్‌ బోర్డు ముట్టడికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముట్టడిని భగ్నం చేశారు. పోలీసుల నిర్భందం కారణంగా కోదండరాం ఇంట్లోనే టిజెఎస్‌ ఆవిర్భావ వేడుకలను ఆయన జరుపుకున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/