మహాభారతము

ఆధ్యాత్మిక చింతన

The MahaBharat
The MahaBharat

ధర్మ శాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రంబని, యథ్యాత్మ విదులు వేదాంతమనియు, నీతి విచక్షణులే నీతి శాస్త్రంబని, కవి వృషభులు మహాకార్యమనియు, లాక్షణికులు సర్వలక్షణంబనియును నైతి హాసికులితిహాసమనియు, పరమ పేరాణికుల్‌ బహుపురాణ సముచ్ఛయంబని మహి గొనియాడుచుండ వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు డాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నభుండు విశ్వజనీనమై పరుగు చుండ(జెసె భారతంబు )అని అంటాడు జంధ్యాల పాపయ్యశాస్త్రి.

మహాభారతాది గ్రంథాలు ప్రసరించే వెలుగులో వేల ఏండ్లు పయనాచింది మనదేశం మహాభారతాన్ని తీసి తీయగనే మనకు కనపడుతుంది సరమ వృత్తాంతం.

జనమే జయుడు యజ్ఞనం చేస్తున్న యాగశాలలోకి ఓ కుక్కపిల్ల ప్రవేశించింది. దానికి ఏ విధమైన దుర్బుద్ధిలేదు. దాని తల్లి సరమ. యజ్ఞశాలలో ప్రవేశించిన కుక్క పిల్లను జనమేజయుడి తమ్ముల-మఱిశేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు తరిమేశారు.

ఆ కుక్కపిల్ల ఏడుస్తూపోయి తల్లితో మొరపెట్టుకొంది. ఆ సరమ కోపంతో జనమే జయడివద్దకు పోయి Iఓ జనమేజయా! జ్ఞానహీనులైన నీ తమ్ములు చిన్న పిల్ల వాడన్న కనికరంకూడా లేకుండా నా పుత్రుని కొట్టి తరిమేశారు.

బీదవారిని, బలహీనులను, మంచి ప్రవర్తన గలవారనీ కారణం లేకుండా హింసిస్తే తప్పక ఆపదలు కలుగుతాయి. వారి పాపం ఊరికే పోదు. తగిన ఫలం అనుభిఆతరు అని సరమ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఎంత ప్రయత్నించినా జనమే జయుడు సరమజాడ తెలుసుకోలేకపోయాడు. ఆయన ముని పల్లెకు వెళ్లి శ్రుతశ్రమనుడనే మునీశ్వరుని కలిసి శాంతి కర్మలు చేయటానికి సోమశ్రమసుడనే
మీ కుమారుణ్ణి పురోహితుడిగా నాతో పంపాలి అని కోరాడు.

సోమశ్రవసునితో జనమే జుడు యాగాలెన్నో చేశాడు. విలువైన హవిస్సులను అగ్నిహోత్రం ద్వారా దేవ తలకందేట్లు చేశాడు. భూమి మీద ఉత్తమ బ్రాహ్మణులందరికీ విరివిగా దక్షిణలిచ్చి సంతోషపెట్టాడు. రఫట 5-ఆది పర్వము, ప్రథమాశ్వాసము శ్రీమదాధ్ర మహాభారతము, రామకృష్ణ మఠం).

ఇది కథ ఈ కథను చదివిన వెంటనే కుక్కలు మనుషులతో మాట్లాడమేమిటి? శాపం పెట్టటమేమిటి? అంతా కట్టుకథ అని భారతాన్నినిందిస్తే మనం వివేకవంతులం కాము. కట్టుకథే అనుకొందాం. గ్రహించటానికి మంచి ఏమైనా ఉందేమో చూద్దాం.

బీదవారిని, బబలహీనులను మంచి వారిని నిష్కారణంగా హింసిస్తే ఆపదలాస్తాయన్న నీతిని నేర్తుతుంది ఈ కథ. సరే, పాప పరిహారం కొరకు కుక్క పిల్లను హింసించిన పాపం పోవాలంటే నీవు కుక్కలకు ఆహారమవ్వు, రోగంతో, గాయంతో బాధపడుతున్న కుక్కలకు వైద్యం చేయించు
అని చెప్పవచ్చు.

ఒకవేళ అతడు బాగా ధనికుడైతే కుక్కలు, కోతులు, పక్షులు చీమలు-వీటన్నిటి దాహాన్ని, ఆకలిని తీర్చు అని చెబితే ఇంకా బాగుంటుంది. కథలో పాపం చేసినవాడు రాజు.

ఎలాగూ రాజులు సంపదనంతా తిని, తాగి తందనాలాడటానికి ఉపయోగిస్తారన్న ఉద్దేశంతో, దాన్ని సద్వినియోగపర్చలన్న సంకల్పంతో పురోహితుడు యాగాలను చేయించి దివి దేవతలకు, భూదేవతలకు దానలిప్పించాడు.

ఆనాటి బ్రాహ్మణులు సంపాదన కొరకు ఏ పనులంటే అవి చేసేవారు కాదు కాబట్టి వారికి దానాలిష్టిం చటం మంచిదే. అయితే చేసిన యాగాల్లో చేసేవారు కాదు కాబట్టి వారికి దానాలిప్పించటం మంచిదే.

అయితే చేసిన యాగాల్లో జీవహింస జరిగి ఉంటే చిన్న తప్పుపు దిద్దటానికి పెద్ద తప్పు చేసినట్టే అఉతుంది. అలా జరకుండా నేడు మనం వివేకంతో వ్యవహరిం చాలం.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/