మతగురువు తాజా మరణం షాకింగ్ గా మారింది

పంజాబ్ రాష్ట్రంలో ఉత్కంఠ

corona death in punjab
corona death in punjab

Punjab: 70 ఏళ్ల  మతగురువు  తాజా మరణం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

కొద్దిరోజుల క్రితం యూరప్ లోని ఇటలీ., జర్మనీకి వెళ్లి వచ్చిన ఆయన  కరోనా  కారణంగా మరణించటంతో గ్రామాలకు గ్రామాలను క్వారంటైన్ లో  పెట్టేశారు.

దీనికి కారణం ఏంటంటే  తన విదేశీ పర్యటన తర్వాత భారత్ కు చేరుకున్న తర్వాత.. ఏ మాత్రం విశ్రాంతి తీసుకోలేదు మతగురువు ఏకంగా పన్నెండు గ్రామాల్లో తిరిగి బోధనలు చేశారు.

ఇప్పుడు కరోనా  పాజిటివ్ తో ఆయన మరణించటంతో.. ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్ చేయాలని నిర్ణయించారు.

పంజాబ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారిన ఈ ఉదంతం లో ఎంతమంది ప్రభావితమై ఉంటారన్నది ప్రశ్నగా మారింది. ప్రాథమిక అంచనా ప్రకారం..మతగురువు కు సన్నిహితంగా అనుచరులు.. ఆయన్ని   అభిమానించే వారు దగ్గర దగ్గరగా  1500 మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇద్దరు శిష్యులకు కరోనా పాజిటివ్ గా తేలటంతో..ఈ భయాందోళన  మరింత పెరిగింది.

ఇప్పటికే ఆయన్ని   కలిసిన 19 మందికి కరోనా సోకటం.. మరో 200 మందికి చెందిన రిపోర్టులు రావాల్సి ఉండటంతో ఉత్కంఠ  పెరిగిపోతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/