రైతుల భూములు సీఆర్డీఏ చేతుల్లోకి వెళ్లిపోయాయి

సీఆర్డీఏ చట్టంలోని అంశాలను వైఎస్సార్‌సిపి మంత్రులు ఒకసారి చదువుకొండి

Devineni Uma Maheswara Rao
Devineni Uma Maheswara Rao

విజయవాడ: అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల చేతుల్లో నుంచి భూములు సీఆర్డీఏ చేతుల్లోకి వెళ్లిపోయాయని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఆంద్రప్రదేశ్‌ సీఆర్డీఏ చట్టంలోని అంశాలను వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు ఒకసారి చదువుకోవాలని ఆయన సూచించారు. రైతుల భూములు చదును చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. సీఆర్డీఏ చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రైతులకు ప్లాట్లను అప్పగించాలని దేవినేని ఉమ డిమాండ్‌ చేశారు. ఏపీలో మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో రావొచ్చునేమోనని శాసనసభ సాక్షిగా సీఎం జగన్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ రిపోర్టులు కేవలం నాన్చుడు కోసమేనని ఆయన విమర్శించారు. రైతులు, కూలీలు, మహిళలు కేసులు పెట్టి మరీ అమరావతి ఉద్యమాన్ని అణచివేసే ప్రక్రియకు తెగబడ్డారని దుయ్యబట్టారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించే వరకు తమ పోరాటం ఆపమని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/