ధైర్యంగా ఎదుర్కొనే నేర్పు

మానసిక వికాసం

The knack

అమ్మాయిలు చదువులోనూ, వృత్తిలోనూ విజయవంతంగా రాణిస్తున్నారు. అసాధ్యమైన రంగాల్లో సైతం తమకు సాధ్యమని నిరూపిస్తున్నారు. ఇలా విజయవంతంగా ముందుకు సాగిపోతున్న ఆమెకు సామాజిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఎంత జీతం సంపాదిస్తున్నా పెళ్లి కావాలంటే కట్నకానుకలను ఇవ్వాల్సిందే. నేరుగా కట్నం అడగలేకపోయినా ఆస్తుల రూపంలో కోరుతున్నారు.

ఆఫీసులో ఆమె బాస్‌ స్థాయిలో ఎదుగుతున్నా లైంగిక వేధింపులు తప్పడం లేదు.

కార్యాలయంలో ఆమె ఉన్నత పదవిలో, తన నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నా ఇంటికి రాగానే భర్త నుంచి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు కాచుకుని ఉంటాయి.

రోడ్డుపై ఒంటరిగా వెళ్తుంటే చాలు ఆకతాయి వెటకారపు మాటలు ఎదురవ్ఞతుంటాయి. ఇవన్నీ ఆమె ఉన్నతికి ఆటంకాలు కలిగిస్తున్నాయి.

ఇవాల్టి రోజుల్లో, ఉదయం లేస్తే పేపర్లలోను, టీవీల్లోనూ కనిపించే వార్తలు హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలే ఉంటున్నాయి.

24గంటల ఛానెల్స్‌ పుణ్యమా అని, వార్తలు జెట్‌ స్పీడ్లో మన కళ్లయెదుట ప్రత్యక్షమవ్ఞతున్నా§్‌ు. మనం కూడా అంతే నిర్లిప్తతతో వాటిని చదివో, టీవీ అయితే చూసో, మన పనులు మనం చూసుకుంటున్నాం.

నిజానికి టీవీల్లోగాని, పేపర్లలోగాని విపరీత దృశ్యాలను, ముఖ్యంగా రక్తపాతాలను అసలు చూపకూడదని ఇంటర్నేషనల్‌ లా చెపుతున్నా, మనం వాటిని పట్టించుకోం సరికదా, కనీసం ఆ చనిపోయిన వ్యక్తిపట్ల ఇసుమంత కూడా గౌరవం చూపలేం.

ఎందువల్ల అంటే, మనలో స్పందనలు తగ్గిపోయి ఉండాలి.

లేక యెవరికో యేదో అయితే మనకేంటి అన్న భావం అయ్యుండచ్చు. అదే ఆపద మనకి కలిగితే మాత్రం ”యెవరూ సరిగా స్పందించలేదుఅని యేడుస్తాం.

పేపర్‌ తిప్పితే అత్యాచారాలు, హత్యాచారాలు, డబ్బులకోసం, హత్యలు కాళ్లకడియాలకోసం, పిల్లల చెవిపోగుల కోసం, మెడలో సూత్రాల కోసం, ఇలా కావేవి హత్యకు అనర్హంలా తయారవుతుంది.

పరిస్థితి. నిర్భయ చనిపోతే ప్రభుత్వ అసమర్థత, అభయ మీద అత్యాచారంలో ప్రభుత్వం సరిగా స్పందించలేదు, రక్షణకు రక్షణ కరువైంది.

ప్రభుత్వ విధానాలు సరిగా లేక…ఇలా ప్రతీదానికి ప్రభుత్వానిదే తప్పు. మరి సమాజం పోషించే పాత్రయేమిటి? కేవలం చూడ్డమేనా? మన చుట్టూ జరుగుతున్న సంగతులను మనం ఎంతవరకు గమనిస్తున్నాం, ఎలా స్పందిస్తున్నాం అన్నది ఒకసారి అవలోకనం చేసుకోవడం అవసరం.

ఢిల్లీలో రోడ్డుపై ఒక అమ్మాయి, అబ్బాయి బస్సు లోంచి త్రోసివేయబడితే, ఎంతమంది ఆ బస్సు ఆపడానికి ప్రయత్నించారు? కళ్లముందు ఆకతాయిలు ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే ఎంతమంది అడ్డుకుంటున్నారు? ఆటో అంకుల్‌ నాతో అదోలా ఉంటున్నాడు అని స్కూలు పిల్లలు చెపుతుంటే ఎంతమంది ఆలకిస్తున్నారు?

ట్రైన్‌లో ఎదురుగా కూర్చున్న ఆడపిల్ల ఒంటరిగా ఎక్కడికి వెళుతుందీ, అని అడిగిందెవరు? చేతల సాయం అటుంచి, కనీసం మాట సాయం చేస్తున్నామా?

ప్రక్కింటి వాళ్లతో, బస్సులో రోజూ ఎదురయ్యే తోటిప్రయాణికులతో రైల్లో రాత్రంతా కూడా ప్రయాణించే తోటి ప్రయాణికులతో మాట్లాడి ఎంతకాలమైందో ఒకసారి ఆలోచించండి.

అలా మాట్లాడగలిగితే ఎంతోమంది నిర్భయలను, మరెంతో మంది ఎస్తెర్‌ అనూహ్యలను కాపాడి ఉండేవాళ్లం. ఆడపిల్ల ఉద్యోగం నిమిత్తం ఒంటరిగా రైల్లో వెళుతుంటే, కనీసం ఆ అమ్మాయి ఎక్కడికి వెళుతుంది, ఎలా వెళుతుంది అన్న ఆలోచన కనీసం ఒక్కరికైనా ఉండి ఉంటే, ఎస్తెర్‌ అనూహ్య, అలా అనూహ్యంగా మాయమైపోదు. ఏ క్రూరమృగాళ్ళ బారినపడిందో పాపం ఆ ఆడకూతురు, కన్నవారికి ఆనవాలు కూడా తెలియనంత దారుణంగా చంపబడింది.

ఈమె ఎవరిని అనుకుంటున్నారా? మూడేళ్లక్రితం ముంబయిలో కామంధుడి చేతిలో బలైపోయిన విశాఖపట్నం అమ్మాయి. ఆ ఆఖరునిమిషాల్లో ఎంత వేదన పొందిందో, ఎంతగా ప్రాధేయపడి ఉంటుందో? అయినా మనసు కరగని ఆ క్రూరమృగాళ్ళు ఆమెను అమానుషంగా తగలబెట్టే సారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఎవరో ఒకరు ఆ సంగతి చూసి ఉంటారు.

కాని,”మనకెందుకులే ఆ గొడవఅని మరింత వేగం పుంజుకుని వెళిపోయి ఉంటారు. ఒకవేళ ”అదేస్థితిలో, నా కూతురో, నా బంధువో ఉంటేనో అన్న చిన్న ఆలోచన, ఇలాంటి హత్యాచారాలను నివారించగలదు. అలాంటి ఆలోచనని యెందుకు రానీయటం లేదు మనం? .

”స్నేహం పేరుతో ”సరదాగా కాసేపు అంటూ, బైకు మీదెక్కించుకుని, నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి, మానభంగంతో ఆగక, ప్రాణం తీసి, తరువాత పోలీసులకు దొరక్కూడదని ఆ శవాన్ని, అమ్మాయిని తిప్పిన బైకులోని పెట్రోలే పోసి తగలేసే సంస్కృతి ఎక్కడిది?

పోలీసులకి దొరికితే శిక్ష పడతాది అన్న భయం ఉందంటే, దానర్థం తను చేసేది తప్పనేగా!

అయినా, తెలిసీ తప్పులు చేస్తూ, ఆధారాలు దొరక్కుండా తప్పించుకునే ఆలోచనలు చేసి రోజుల్లో ఉన్నాం మనం. ఉద్యోగాలపేరుతో అమ్మాయిలు బయటకి వెళ్లడం తప్పదు.

తోటి ఉద్యోగులతో మాట్లాడటం, కలిసి ఉండటం తప్పదు. అబ్బాయిలిద్దరు ఉండేంత సహజంగా, అమ్మాయి అబ్బాయి ఉండలేని పరిస్థితి. అమ్మాయిల గురించి వెకిలి కామెంట్స్‌, తక్కువ చేసి మాట్లాడటం, చులకనగా చూడటం, ప్రాణం మీదకి వచ్చినట్లు ఉండటం వంటివి చాలా సహజం అయిపోయాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/