కెసిఆర్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది

ashwathama reddy
ashwathama reddy

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, యూనియన్లను చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసి జేఏసీ కన్వీనర్‌ అశ్వత్తామరెడ్డి రెండో రోజు నిరవధిక దీక్షను మొదలుపెట్టారు. ఇంటి చూట్టు భారీగా పోలీసులు మోహరించడం, రాకపోకలకపై ఆంక్షలు పెట్టడంతో తన ఇంట్లోనే 20 మంది మహిళా కండక్టర్లతో కలిసి దీక్ష ప్రారంభించారు. ఇవాళ ఉదయం ఆయన నివాసంలో మీడియాతో మాట్లడుతూ..ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికులపట్ల కెసీఆర్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహిస్తోందని, ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు 43 రోజులుగా సమ్మె జరుగుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజారవాణాను కాపాడుకోవడం కోసమే సమ్మెచేస్తున్నామని, ప్రజలంతా సర్కారుపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/