ఇల్లు అందంగా

Beautiful House

కొందరి ఇళ్లు ఉండడానికి చిన్నవే కాని చూసేందుకు చాలా పెద్దగా కనిపిస్తాయి. మీ ఇల్లు కూడా చిన్నదే అయినా పెద్దగా కనిపించాలంటే ఇంటీరియల్‌ విషయంలో జాగ్రత్తపడితే సరిపోతుంది అంటున్నారు డిజైనర్లు. చిన్న గది అనగానే లైట్‌ కలర్‌ వాడాలి అనుకుంటారు. కాని అది అపోహ మాత్రమే. ఆ గదిని మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి కలర్‌ ఎంపిచేసుకోవాలి. అది బెడ్‌రూమ్‌ అయితే వామ్‌ కలర్స్‌. బాత్‌ రూమ్‌ అయి తే కూ ల్‌ షేడ్స్‌ వా డాలి.

ముదురు నీలం రంగు వేస్తే హాయిగా అనిపిస్తుంది. గోడలకు పెయింట్‌ వేసేటప్పుడు సీలింగ్‌కు పది సెంటీమీటర్లు కింద నుంచి వేయాలి. వదిలేసిన దానికి తెలుపు పెయింట్‌ వేయాలి. తెలుపు రంగును వాడడం వల్ల సీలింగ్‌ ఎత్తుగా అనిపిస్తుంది.
దాంతో గది పొడవుగా ఉన్నట్లు కనిపిస్తుంది. క్రిస్ప్‌ వైట్‌ కలర్‌కి తగ్గట్లుగా టీల్‌ టోన్స్‌ బ్లూ గ్రీన్‌ రంగుల మిశ్రమం వాడితే చాలా బాగుంటుంది. సన్నగా ఉన్న కారిడార్‌ గోడలకి ఇరు చివరలా ముదురు రంగులు వేసేత విశాలంగా ఉన్న లుక్‌ వస్తుంది.

డ్రమాటిక్‌ లుక్‌ కావా లంటే రిచ్‌ రెడ్‌ వేసి చూడండి. గదు ల్లో వాడే ఫ్యాబ్రిక్స్‌. ఫర్నిచరల్‌లకు దగ్గరి రంగులనే గోడలకు పెయింట్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల చూడగానే ప్రశాంతమైన భావన కలుగుతుంది. గది కూడా ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఇందుకు గ్రీన్‌ కలర్‌ షేడ్స్‌ బాగుంటాయి.

చిన్న గదికి ఉడ్‌వర్క్‌, మౌల్డింగ్స్‌ చేయించుకునేటప్పుడు అవి గోడ రంగుకంటే ఒక షేడ్‌ డార్క్‌ ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా చేయడం వల్ల కాంట్రాస్ట్‌గా ఉండి గది పెద్దదిగా కనిపిస్తుంది. లేత బూడిదరంగు గోడలకు ముదురు బూడిద రంగు ఉడ్‌వర్క్‌ చేయిస్తే అధునాతనంగా ఉంటుంది.

గోడలకు పెయింట్‌ వేశాక పెద్ద పెద్ద అద్దాలు పెట్టడం వల్ల ఆ గది వైశాల్యం రెండింతలు పెరిగినట్లు అనిపించి ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/