హిందూ ఏకతా ఆందోళన పార్టీ తెలంగాణ శాఖ అవిర్భావం

సైఫాబాద్, ప్రభాతవార్త: హిందూ ఏకతా ఆందోళన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ బుధవారనాడిక్కడ ఎన్ఎస్ఎస్లో ప్రారంభమైంది. హిందూ మత ధర్మం, హిందూ సంస్కృతి, దేవాలయాల పరిరక్షణ కోసం తెలంగాణలో శాఖను ప్రారంభించడం జరిగిందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరక్ బహుదూర్ ఛత్రి, రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జునశర్మ, సభ్యుడు ఆంజనేయులుయాదవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. రజకార్లకు కోమ్ముకాస్తున్న ఎంఐఎం అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరపున ఒక అభ్యర్ధి పోటి చేస్తున్నారని, తమ అభ్యర్ధి విజయం సాధిస్తే అందరికి ఇళ్ళు, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని వారు స్పష్టం చేశారు.