వాద్రా రెండు వారాల్లోగా సమాధానమివ్వాలి

Robert Vadra
Robert Vadra

న్యూఢిల్లీ: రాబర్డ్‌ వాద్రాను మనీలాండరింగ్‌ కేసులో విచారణ కోర్టు ముందస్తు బెయిల్‌ ముంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా సమాధానమబివ్వాలిన ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 26కు న్యాయమూర్తి చంద్రశేఖర్ వాయిదా వేశారు.
తనకు ముందస్తు బెయిలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కేటాయించాల్సిందిగా వాద్రా మంగళవారంనాడు కోర్టును కోరారు. ఈడీ పిటిషన్‌పై కోర్టు నోటీసు ఇచ్చే సమయానికి వాద్రా విదేశాల్లో ఉన్నాయని, జూలై 11న వాద్రా ఇండియాకు తిరిగొచ్చారని వాద్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, విచారణకు వాద్రా సహకరించడం లేదని కోర్టుకు ఈడీ తన వాదన వినిపిస్తూ, ఆయనకు జూలై 1న స్థానిక కోర్టు ముందస్తు బెయిలు ఇవ్వడాన్ని సవాలు చేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/