సోషల్‌ సైన్స్‌కు పెరుగుతున్న ఆదరణ

నిన్నమొన్నటి వరకు క్రేజీ కోర్సులంటే ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ ఈ రెండూ కాకుంటే బిఎస్సి, విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా వీటివైపే మొగ్గుచూపేవారు. బిఏ కోర్సులకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. పరిస్థితుల్లో ఇప్పుడిపుడే మార్పు వస్తోంది. టెక్నికల్‌,మెడికల్‌ సంబంధిత కోర్సులకు దీటుగా హ్యుమానిటీస్‌/సోషల్‌ సైన్స్‌కు ఆదరణ పెరుగుతోంది.

Career-

ఇక సివిల్‌ సిర్వీసెస్‌ పోటీ పరీక్షలోనూ డిగ్రీలో ఏ విభాగాల విద్యార్ధులైనా సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులను ఆప్షన్‌లా ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే గ్రూప్‌-1,గ్రూప్‌-2 లు సోషల్‌ సైన్స్‌స్‌ చదివినవారికి అనుకూలంగా ఉంటాయి. సిలబస్‌లో ఎక్కువశాతం వీటికి సంబంధించినదే. హ్యూమానిటీస్‌/సోషల్‌ సైన్స్‌స్‌లో ఎన్నో పాపులర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నవాటితో పాటు కొత్త స్పెషలైజేషన్లు/సబ్జెక్టులను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి.

దేశ సామాజిక,ఆర్థిక పరిస్థితులు, కంపెనీలు, కార్పొరేట్ల అవసరాలకు తగిన కోర్సులను ఆఫర్‌ చేయడంలో ముందుంటున్నాయి. బిఏ/ఎంఏ లో జాగ్రఫి,హిస్టరీ,యునిసెంట్‌ ఇండియన్‌ హిస్టరీ- కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ,సోషియాలజీ,సోషల్‌ వర్క్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌ ఇంగ్లీష్‌,స్పానిష్‌, ఫ్రెంచ్‌,జర్మన్‌ పాలిటి పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యునికేషన్స్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌, ఎడ్యుకేషన్‌, ఉమెన్స్‌ స్టడీ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ వంటి కోర్సులు చదివిన వారికి నేడు వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఎదురు చేస్తున్నాయి.

ప్రభుత్వ విభాగాల్లో సోషల్‌ సైన్స్‌స్‌ హ్యుమానిటీస్‌ కోర్సులు చదివినవారికి ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఏటా యూపిఎస్సి నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి అత్యున్నత అధికారులుగా రాణించోచ్చు. ఈ పరీక్షల్లో సైన్స్‌, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో ఎక్కువ మంది ఆప్షన్‌లుగా జాగ్రఫి/సోషియాలజీ/తెలుగు సాహిత్యం/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/హిస్టరీ వంటి సబ్జెక్టులను ఎంచుకుని పరీక్ష రాస్తున్నారు. చిన్నతనం నుంచే సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యంగా నిర్ధేశించుకున్న వారు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ చేరుతున్నారు.

గ్రూప్‌-1, గ్రూప్‌-2 వంటి పోటీ పరీక్షలు రాసి డిప్యూటీ కలెక్టర్‌(ఆర్డివో), కమర్షియల్‌ బ్యాక్స్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ డిప్యూటీ తహసిల్ధార్‌ వంటి ఉద్యోగాలను దక్కించుకొవచ్చు. బిఈడి కూడా పూర్తిచేస్తే డిఎస్సి రాసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేయోచ్చు. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్స్‌గా విధులు నిర్వర్తించవచ్చు. బ్యాంకు పరీక్షలు కూడా రాసుకోవచ్చు.

సోషల్‌వర్క్‌/రూరల్‌ డెవల్‌మెంట్‌్‌ కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ స్వచ్ఛంద సంస్థల్లో,గ్రామీణాభివృద్ధి సంస్థల్లో ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సిఎస్‌ఆర్‌) కింద కంపెనీలు కొంత మొత్తాన్ని సామాజిక, ప్రజోపయోగ కార్యక్రమాలకు ఖర్చు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఆయా కంపెనీలు ప్రత్యేకంగా సిఎస్‌ఆర్‌ విభాగాలను ఏర్పాటు చేశాయి. వీటిని పర్యవేక్షించడానికి సోషల్‌ వర్క్‌,కోర్సులను చేసినవారిని నియమించుకుంటున్నాయి. ఇందుకోసం భారీ వేతనాలు చెల్లిస్తున్నాయి.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్రామీణాభివృద్దికి పెద్దపీటే వేస్తున్న నేపథ్యంలో సోషల్‌ వర్క్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు చేసినవారికి ఉద్యోగాలు కోకొల్లలు. త్రవ్వకాల్లో బయటపడిన ప్రాచీన కళాఖండాలను, ఆయుధాలు వస్తువులను భద్రపరిచే నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆయా వస్వువులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రదర్శనశాలలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రకారులు, ఆర్కియాలజిస్టుల అవసరం ఎంతో ఉంది.

ఇపుడున్న కట్టడాలకు ఎలా ఇబ్బంది లేకుండా, నిర్మాణాలు దెబ్బతినకుండా వాటిని పర్యవేక్షించాల్సి వుంటుంది. ఇలా చరిత్రకు సంబంధించి వివిధ విభాగాల్లో ఆర్కియాలజిస్టులుగా అవకాశాలు ఉన్నాయి.
దేశంలో ఆర్ధిక సంస్కరణల అమలు, విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం, కొత్త కంపెనీల ఏర్పాటుతో ఆర్థిక శాస్త్రం చదివిన వారికి అవకాశాలు పెరిగాయి.

ఆర్థిక శాస్త్రం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూపిఎస్సి ద్వారా ఇండియన్‌ ఎకనామిక్స్‌ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది.కేంద్ర విభాగంలోని వివిధ శాఖల్లో ఆర్ధికాధికారులు భర్తీకి ప్రతి ఏటా ఐఈఎస్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌సైన్స్‌ చేసిన వారికి వివిధ ప్రభుత్వ గ్రంథాలయాల్లో కళాశాలలు, యూనివర్సిటీల లైబ్రరీలు పత్రికల్లో అవకాశాలుంటాయి. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యునికేషన్స్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ కోర్సులు పూర్తిచేసిన వారు వివిధ పత్రికలు, మ్యాగజైన్లు టివీ చానళ్లు సినీ రంగం ప్రభుత్వ విభాగాల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించవచ్చు.

ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ, ప్రజా సంబంధాల కార్యాలయాల్లో పబ్లిక్‌ రిలేషన్స్‌ సమాచార శాఖాధికారులుగా పనిచేయోచ్చు. విద్యార్ధులు కోర్సుల్లో చేరడానికి ముందుగానే తాము ఎలాంటి కెరీర్లో స్థిరపడాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి రావాలి. ఆ కెరీరుకు రాబోయే ఐదు/ పదేళ్లలో ఎలాంటి అవకాశాలుంటాయో కూడా తెలుసుకోవాలి.

ఇందుకనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే విలువైన సమయం/డబ్బు వృథా అవుతాయని అంటున్నారు. విజయవంతమైన కెరీర్‌ను అందుకోవాలంటే పోటీ పరీక్షలో విజయం సాధించాలి.ముందు నుంచీ సిద్ధం కావాలని చెబుతున్నారు. విస్తృత అధ్యయనం సమాచార సేకరణ పరిశోధన నైపుణ్యాలు క్రిటికల్‌, లాజికల్‌ థింకింగ్‌ వర్తమానాంశాలపై పట్టు రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ లెవల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సెట్‌) రాసి డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌ పరీక్షలకు అర్హత సాధించొచ్చు.

జాతీయస్థాయిలో యూజిసి ఏటా రెండుసార్లు నిర్వహించే నేషనల్‌ లెవల్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌(నెట్‌) రాసి జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ఐఐఎంలు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్రస్థాయి యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అవకాశాలందుకోవచ్చు. నెట్‌ ద్వారా జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే ప్రతినెలా ఫెలోషిప్‌ పొందుతూ పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది.

సాధారణ డిగ్రీ కోర్సులైన బి.కాం, బిఎస్‌సిలలో కంప్యూటర్‌ సమ్మిళిత కోర్సులు ఉంటాయి. అవే బి.కామ్‌ కంప్యూటర్స్‌, బి.ఎస్‌సి కంప్యూటర్‌. ఈ కోర్సులలో ప్రాథమిక అంశాలైన ఎం.ఎస్‌ ఆఫీస్‌తో పాటు ఏవైనా రెండు ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజీలను నేర్పిస్తారు. వీటితో పాటుగా ఇంటర్నెట్‌ వాడటం లాంటి అంశాలు కూడా ఉంటాయి. మొత్తం మీద కంప్యూటర్‌ అంటే ఒక సమగ్ర అవగాహన వచ్చే విధంగా ఈ కోర్సుల స్వరూపం ఉంటుంది.

అయితే ఒక విద్యార్థి తన డిగ్రీ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఇవి మాత్రమే సరిపోవు.. వీటికి సమాంతరంగా విద్యార్థులు మరికొన్ని కంప్యూటర్‌ ఆధారిత అప్లికేషన్స్‌లను నేర్చుకోవాల్సి ఉంటుంది. బి.కాం విద్యార్థులైతే తప్పనిసరిగా అకౌంటింగ్‌ ప్యాకేజీ, ట్యాలీ లాంటివాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. మిగతా విద్యార్థులైతే జావా, ఒరాకిల్‌ లాంటి అధునాత ప్రోగ్రాంలతో పాటు డిటిపిని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది.

అప్పుడు సాధారణ డిగ్రీ విద్యార్థులు కూడా బహుళ జాతి కంపెనీల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలను పొందగలరు. ఆ తర్వాత కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లు ఎక్కువగా ఉండే కోర్సు ఇంజనీరింగ్‌. ఇంజ నీరింగ్‌ నందలి దాదాపు అన్ని బ్రాంచిలలో కంప్యూటర్‌ యొక్క ఉపయోగం ఉన్నప్పటికీ కొన్ని కోర్సులలో కంప్యూటర్‌ పూర్తిగా ఇమిడి ఉంటుంది.

నూతన కోర్సులు: ఆల్టర్నేటివ్‌ డిస్‌ప్యూట్‌ రెజల్యూషన్‌

వ్యాపార సంస్థల్లో ఏవైనా వివాదాలు తలెత్తినపుడు కోర్టులు, న్యాయమూర్తులను ఆశ్రయించాల్సిన ఆవసరం లేకుండా సిఎలే వివాదాలను పరిష్కరిస్తుంటారు. ఈ ఎడిఆర్‌ మంత్రాంగం ద్వారా వివాదాల పరిష్కారం న్యాయస్థానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో వేగవంతంగా పూర్తవుతుంది.
శిక్షణ సమయం: 10 రోజులు: సిపిఇ గంటలు:30

ఉద్యోగావకాశాలు:

సిఏలు తమ పరిజ్ఞానం, నైపుణ్యం, అనుభవం, సమతుల్య ఆలోచనా విధానాలను బట్టి ఆర్బిట్రేటర్లుగా, మీడియేటర్లుగా, కన్సిలియేటర్లుగా ఎడిఆర్‌ యంత్రాంగాన్ని ఆనుసరించి వివాదాలను పరిష్కరి స్తుంటారు. ఈ విధానాలపరంగా సిఎలకు అనేక ఉద్యోగావకాశాలున్నాయి. పన్ను విధానంలో వస్తున్న నూతన సంస్కరణలు, ప్రతిపాదనల్లో వస్తున్న మార్పులపట్ల సిఎలకు
పరిజ్ఞానాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఐసిఎఐ పరోక్ష పన్నుల కమిటీవారు ఈ సర్టిపికేషన్‌
కోర్సును ప్రవేశ పెట్టారు. పరిశ్రమలో ఉన్న ఐసిఎఐ సభ్యులందరికీ జిఎస్‌టి విధానాలపట్ల
తాజా పరిజ్ఞానం అందించటం దీని ముఖ్యోద్దేశం.

శిక్షణ సమయం: 10 రోజులు:
సిపిఇ గంటలు: 30, ఉద్యోగావకాశాలు: జిఎస్‌టి స్పెషలిస్టులు,
ప్రాక్టీషనర్లుగా చక్కటి అవకాశాలుంటాయి.
ఉద్యోగావకాశాలు: ఆర్థిక సేవ నిర్వహణ రంగాల్లో అవకాశాలుంటాయి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/