భైంసా అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మజ్లిస్‌ పార్టీ ఆగడాలను ఆరికట్టాలి

k laxman
k laxman

నిర్మల్‌: భైంసాలో జరిగిన అల్లర్లకు పూర్తి బాధ్యత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వహించాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. భైంసాలో జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఈ రోజు ఆయన పరామర్శించారు. భద్రత కల్పించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో మజ్లిస్‌ పార్టీ ఆగడాలను ఆరికట్టకపోతే భైంసా లాంటి ఘటనలు తెలంగాణ వ్యాప్తంగా జరిగే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తాము అనుభవించిన బాధలు ఈ రోజున భైంసాలో ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భైంసా ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో జ్యుడిషియల్‌ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంఐఎం అధినేత ఒవైసీని ముఖ్యమంత్రి కెసిఆర్‌ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని, కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే టిఆర్‌ఎస్‌కు పడుతుందని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/