రోజుకు 9 పనిగంటలు కనీసవేతనాన్ని నిర్ణయించని ప్రభుత్వం

Govt office
Govt office

న్యూఢిల్లీ: ఒక రోజు సెలవుదినంతో రోజుకు 9 పని గంటలు చేయాలనే ప్రతిపాదనను భారత ప్రభుత్వం డ్రాప్ట్‌ వేజ్‌ రూల్స్‌లో తీసుకొచ్చింది. అయితే, ఆజతీయ కనీస వేతనం ఎంత ఉండాలనేదానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో వేతనాలు నిర్ణయించడానికి మూడు భౌగోళిక వర్గీకరణలు సూచించడం మినహా చాలా వరకు పాత నిబంధనలను ముసాయిదా పునరుద్ఘాటించింది. రోజుకు 9 పని గంటల ప్రతిపాదనపై డ్రాఫ్ట్‌ రూల్స్‌ అభిప్రాయాలను కోరింది. ఇప్పటికే చాలా ఫ్యాక్టరీలు కార్మికులతో 9 గంటల పని చేయిస్తున్నాయి. ఇదే నిబంధనలను అన్ని సంస్థలకు వర్తింపచేయాలని ప్రయత్నం జరుగుతోంది. అందుకే మేము ఈ వేజ్‌ కోడ్‌ను వ్యతిరేకించాం, ఈ నిబంధనలను కార్మికుల ప్రయోజనాలను గుర్తించడాం లేదని సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎకె పద్మనాభం తెలిపారు. కనీస వేతనంపై లేబర్‌ కోడ్‌ స్పందించకపోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కొందరు నిపుణుల కమిటీ దీనిపై సలహాలు ఇవ్వాల్సి ఉంది. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ అంతర్గత ప్యానెల్‌ జనవరిలో ఈ మేరకు తన రిపోర్టులో వెల్లడించింది.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/andhra-pradesh/