చేసేది – చేయించేది

షిర్డీసాయి మహిమలు:

Sri Shirdi SaiBaba

సాయిబాబా రామయాణ గ్రంథాన్ని పారాయణ చేయమని భక్తులకు, సందర్శకులకు చెప్పేవాడు. సాయిబాబా స్వయంగా శ్రీరామవిజయం అనే రామాయణాన్ని పారాయణ చేయించి స్వయంగా శ్రవణం చేశాడు. రామాయణ గ్రంథంలోని పాత్రలు, ఆ పేర్లతో కాకున్నా, దాదాపు అన్నిచోట్ల కానవస్తాయి.

సాయి రామాయణాన్ని పారాయణ చేయించేదెందుకంటే రామాయణంలో ఉన్న పాత్రలలోని బాలహీనతలను తొలగించుకోమని, ఇంకా ఉన్నత గుణాలను పెంచుకోమని. సాయిబాబా వద్ద బయ్యాజీ అప్పాజీ పటేల్‌ అనే భక్తుడుండేవాడు. అతడు షిరిడీలోనే నివసించేవాడు.

అతడు ప్రతిరోజూ సాయిబాబాకు మాలిష్‌ చేసేవాడు తరువాత సాయిబాబాను తన చేతులతో మోసుకుని ధుని వద్ద అవలీలగా దించేవాడు. కొంతకాలం తర్వాత తాను సాయిబాబాను మోస్తున్నాననే అహంకారం కలిగింది. ఒకరోజు ఎంత ప్రయత్నించినా అతడు సాయిబాబాను పైకెత్తలేకపోయాడు. సాయి అతడిని చూచి చిరునవ్ఞ్వనవ్వాడు.

చిరునవ్వులోని అంతరార్ధం బయ్యాజీకి తెలిసింది. అతని గర్వం తొలగింది. మరల సాయినిపైకెత్తి అవలీలగా, మునుపటి వలె ధుని వద్ద కూర్చుండబెట్టాడు. నమస్కరించాడు బయ్యాజీ. అతని గర్వం పటాపంచలయింది. గర్వం అనేది పెంచుకోతగ్గది కాదు. తుంచుకోతగ్గది.

సాయితో సంబంధం ఉన్న ఒక రామాయణం – శ్రీరామవిజయం. దీనిని రచించినది శ్రీధరకవి. ఈ శ్రీధరకవికి తండ్రియే గురువు నలుడు రామాయణంలోని ఒక పాత్ర. ఈతడు నీటిలో పడవేసిన ఏ వస్తువయినా, ఎంత బరు
వు కలది అయినా పైకి తేలుతుంది.

రాముడు సముద్రంపై సేతువు నిర్మించదలచాడు. అందులో నలుని పాత్ర చాలా ఉన్నది. అతడు సముద్రంలో వేసిన కొండలు, రాళ్లు పైకి తేలతాయి. అతడు మొదటి దినం పనిని మొదలుపెట్టాడు. అందరితో పాటుగా హనుమంతుడు కూడా అనేక కొండలను తెచ్చాడు. మొదటిరోజు సాయంకాలానికి అద్భుతమైన రీతిలో కొంత సేతు వు నిర్మాణం జరిగింది.

నా వల్ల ఈ పాషాణాలు, కొండలు తేలున్నాయనే అహంకారం నలునిలో ఎక్కువైంది. అందరూ చూస్తుండగనే సేతువ్ఞ మాయమయింది. చేపలు వచ్చి ఆ కట్టబడిన సేతువ్ఞను మింగేసాయి అనే సంగతి ఎవరికీ తెలియదు. ఇదంతా రావణుడిదని అనుకున్నారు కొందరు.

నలుడు కలవరపడ్డాడు. శ్రీరాముము శరభుడు అనే వ్యక్తిని పిలిచాడు. శరభుడికి సముద్రంలో ఉన్న తిమింగలాన్ని పిలుచుకురమన్నాడు. శరభుడు తిమింగిలాన్ని తీసుకువచ్చాడు.

తిమింగలం రాముని వద్దకు వచ్చి ‘నా చిన్న పిల్లలు పసితనం వల్ల తెలియక సేతువు ను మింగారు. తిరిగి క్షణంలో సేతువ్ఞను తెస్తాను అని పలికి, మింగిన ఆ సేతువ్ఞను కక్కించింది.

‘పిల్లలు మంచి అద్భుతాన్ని గావించారు అన్నాడు రాముడు నలుని చూస్తూ. నలుని గర్వం నేల రాలిపోయింది. ఇక నలునిలో గర్వం తలెత్తలేదు. చేసేది తానుగా కనపడుతున్నా, చేయించేది రాముడే అని తెలుసుకున్నాడు. మనం కూడా గర్వరహితుల మవుదుముగాక!

  • యం.పి.సాయినాథ్‌

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/