‘ది ఘోస్ట్’ నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. సంక్రాంతి బరిలో నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్..ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏజ్‌లో కూడా నాగార్జున.. రా ఏజెంట్‌ పాత్రలో చేసిన స్టంట్స్ ఈ సినిమాలో హైలెట్ అని చెబుతున్నారు.

ఇక ఈరోజు శుక్రవారం ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. ‘వేగమ్’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ మ‌దినేని ర‌చించ‌గా.. క‌పిల్ క‌పిల‌న్‌, ర‌మ్య బెహ‌రా ఆలపించారు. భ‌ర‌త్-సుర‌భ్ స్వరాలందించారు. ఇదిలా ఉంటే దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో అందాల భామ సోనల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

YouTube video