నాగార్జున ‘ది ఘోస్ట్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. సంక్రాంతి బరిలో నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్..ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏజ్‌లో కూడా నాగార్జున.. రా ఏజెంట్‌ పాత్రలో చేసిన స్టంట్స్ ఈ సినిమాలో హైలెట్ అని చెబుతున్నారు. ఇక ఈరోజు గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్.

ఇందులో నాగార్జున రెండు చేతుల్లో రెండు పెద్ద కత్తులు పట్టుకొని శత్రు మూకను ఊచకోత కోయడాన్ని చూడొచ్చు. ఫార్మల్ సూట్ లో కింగ్ చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు. ఘోస్ట్-కిల్లింగ్ మెషిన్ వీడియో అతని ఆవేశాన్ని కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఘోస్ట్ తో ఎప్పుడూ గొడవ పడకండి అని ఈ వీడియోలో పేర్కొన్నారు. దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా సెట్ అయింది. విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ గ్లింప్స్ సినిమాపై కచ్చితంగా ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. ఇదిలా ఉంటే దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తామని తాజా గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో అందాల భామ సోనల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

YouTube video