ది ఘోస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్

కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సంక్రాంతి బరిలో నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్..ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. మార్క్ కే రాబిన్ దీనికి సంగీతం ఇచ్చారు. అయితే టాక్ బాగున్నప్పటికీ , కలెక్షన్లు మాత్రమే చెప్పుకోదగ్గ రాకపోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే..

నైజంలో 57 లక్షలు
సీడెడ్ లో 24 లక్షలు
ఉత్తరాంధ్ర 31 లక్షలు
ఈస్ట్ లో 23 లక్షలు
వెస్ట్ లో 8 లక్షలు
గుంటూరులో 22 లక్షలు
కృష్ణాలో 20 లక్షలు
నెల్లూరులో 15 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇక కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్ అయితే కేవలం 20 లక్షలు , యూఎస్ లో 25 లక్షల షేర్ రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.45 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా 4.60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.