టాలీవుడ్ ఫిలిం మేకర్ల దృష్టి!

టాలీవుడ్ ఫిలిం మేకర్ల దృష్టి!
ketika sharma

‘రొమాంటిక్’ హీరోయిన్ కేతిక శర్మ ఒక్కసారిగా తన లుక్స్ తో.. బోల్డ్ యాటిట్యూడ్ టాలీవుడ్ ఫిలిం మేకర్లను ఆకర్షించిందనే టాక్ వినిపిస్తోంది.  
పూరి జగన్నాధ్ నిర్మాణంలో ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రొమాంటిక్’ తో కేతిక శర్మ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఈమధ్యే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఒక పోస్టర్లో బీచ్ నేపథ్యంలో ఆకాష్ పూరి ఈ భామను భుజాలపై కూర్చోబెట్టుకున్నాడు.  మరో పోస్టర్లో కేతిక టాప్ లేకుండా ఆకాష్ ను గట్టిగా హత్తుకుంది.  ఈ పోస్టర్ ను చూసిన ప్రేక్షకులు ఎంత షాక్ అయ్యారో ఏమో కానీ టాలీవుడ్ ఫిలిం మేకర్లలో మాత్రం కలకలం రేగిందట.  ఈ హాటు భామ ఎవరంటూ ఎంక్వైరీలు మొదలు పెట్టారట.  కేతిక యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని ఆరాలు తీస్తున్నారట. ఒకవేళ యాక్టింగ్ కనుక యావరేజ్ అని తెలిసినా చాలు తమ సినిమాలకు ఆఫర్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/