మూసీకి పోటెత్తిన వరద

నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు చర్యలు

Musi River
Musi River

Suryapet: మూసీకి వరద పోటెత్తింది. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్కసారిగా వరద ప్రవాహం విపరీతంగా పెరగడంతో జనం భయాందోళనలకు గురయ్యారు.

మంత్రి జగదీశ్వరరెడ్డి చొరవతో రత్నపురం వద్ద గండి పెట్టి నీటిని కిందకి వదలడంతో పెనుముప్పు తప్పింది. 

ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మూసీకి వరద పోటెత్తిందన్నారు. 

ఎప్పటికపప్పుడు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/