ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మత్స్యకారులు

20-ap-fishermen-freed-pakistan-meets-cm-jagan
20-ap-fishermen-freed-pakistan-meets-cm-jagan

తాడేపల్లి: పాకిస్థాన్‌ చెర నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 20 మంది మత్స్యకారులు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసులో ఈ రోజు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బతికనంత కాలం మీ పేరు చెప్పుకుంటాం అని మత్స్యకారులు అన్నారు. కాగా గుజరాత్‌ తీరం వెంబడి పొరపాటున పాక్‌ జలాల్లోకి ప్రవేశించిన 20 మంది ఆంధ్రా జాలర్లను పాకిస్థాన్‌ బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. 14 నెలలుగా పాక్‌ జైలులో ఉన్న మత్స్యకారులు సీఎం జగన్‌ చొరవతో సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. వాఘా బోర్డర్‌ వద్దకు వెళ్లిన ఏపీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విడుదలైన జాలర్లను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ మత్స్యకారులకు ఒక్కొక్కరకి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/