అబుదాబిలో తొలి అద్భుత హిందూ దేవాలయం
నమూనా రూపం వీడియో విడుదల

Dubai: గల్ఫ్ దేశాల్లోనే మొదటిసారి అబూదాబిలో నిర్మిస్తున్న హిందూ దేవాలయం నిర్మాణం తాలూకు తుది నమూనా విడుదలైంది.
బీఏపీఎస్ హిందూ మందిర్ కమిటీ వీడియో రూపంలో విడుదలచేసిన ఈ నమూనా విశేషంగా ఆకట్టుకుంటున్నది.
పూర్తిగా శిలలతో నిర్మిస్తున్న ఈ ఆలయ నిర్మాణానికి అబూ మురీఖా ప్రాంతంలో గతేడాది ఏప్రిల్లో శంకుస్థాపన చేశారు.
డిసెంబర్ నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా విడుదల చేసిన తుది నమూనా వీడియోలో హిందూ పురాణ గాథల చిత్రాలతో రాతి స్తంభాలు వెలుగులీనుతున్నాయి.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/