కర్నూలు ఎయిర్‌పోర్టు కు చేరిన తొలి విమానం
బెంగళూరు – కర్నూలు ఇండిగో విమానం రాక

Kurnool: కర్నూలు ఎయిర్‌పోర్టులో బెంగళూరు – కర్నూలు ఎయిర్‌పోర్టుకు తొలిసారిగా ప్రయాణికులతో కూడిన విమానం చేరుకుంది. 52 మంది ప్రయాణికులు ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి కర్నూలు చేరుకున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఈ విమానంలో ఉన్నారు. కాగా బెంగళూరు-కర్నూలు ఎయిర్‌పోర్టుకు విమానంలో వచ్చిన వికలాంగులు, ప్రయాణికులతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ముచ్చటించారు.
కర్నూలు నుంచి 74 మంది ప్రయాణికులు మరో విమానంలో విశాఖపట్నం బయలుదేరారు. అటు వైజాగ్ బయలుదేరే విమానానికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి జాతీయ జెండా ఊపారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/