నిద్రలేచిన ప్రతీ ఉదయం ఆ పరాభవమే గుర్తొచ్చేది

ప్రపంచకప్‌లో ఓటమిపై టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ

Virat Kohli
Virat Kohli

లౌడర్‌హిల్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెస్టిండీస్‌తో తొలి టీ20కి ముందు కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచకప్‌లో టీమిండియా నిష్క్రమణ పై స్పందించాడు. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత కొన్ని రోజులు దారుణంగా గడిచాయని, ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని చెప్పాడు. ప్రపంచకప్‌ ముగిసేవరకూ నిద్రలేచిన ప్రతీ ఉదయం ఆ పరాభవమే గుర్తొచ్చేదని, ఆ తర్వాత రోజు వారీ కార్యక్రమాల్లో పడి మర్చిపోవడానికి ప్రయత్నించామని చెప్పాడు. తాము అంతర్జాతీయ ఆటగాళ్లమని, జరిగిన వాటికి చింతించకుండా ముందుకుసాగడంపై దృష్టిసారించామని తెలిపాడు.
అంతేకాక వెస్టిండీస్‌ పర్యటనకు ధోనీ లేకపోవడంపై స్పందిస్తూ అతడి అనుభవం టీమిండియాకి ఎంతో అవసరమని పేర్కొన్నాడు. ధోనీ లేని లోటు యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌పంత్‌కు చక్కటి అవకాశమని కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్‌లో పంత్‌ రాణించాలని, అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/