విశాఖలో తొలి కరోనా కేసు

అప్రమత్తమైన అధికారులు.. ప్రత్యేక బృందాల ఏర్పాటు

coronavirus
coronavirus

విశాఖపట్నం: విశాఖలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో విశాఖ నగరం ఉలిక్కిపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని అల్లిపురంకు చెందిన వృద్దుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. అతని నివాస ప్రాంతమైన అల్లిపురం పరిసర ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీనికోసం ఏన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్‌తో 114 బృందాలను ఏర్పాటు చేశామని డీహెచ్‌ఎంవో తిరుపతిరావు తెలిపారు. అల్లిపురం చుట్టుపక్కల సుమారు 7800 గృహలలోని వ్యక్తులను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాని వైరస్‌ గురించి ఎవరు భయపడవద్దని, ప్రభుత్వం చేసిన సూచనలను తప్పకుండా పాటించాలని డిహెచ్‌ఎంవో కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/