నిజామాబాద్‌లో ఈనెల 9న రైతుల ర్యాలీకి

rajath kumar
rajath kumar

నిజామాబాద్‌ :జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై రజత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్‌ పోలింగ్‌ ఉంటుంది. ఎన్నికల ఏర్పాట్లపై రైతు అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల అనుమానాలు పూర్తిస్థాయిలో నివృత్తి చేశాం. నిజామాబాద్‌కు ఒక హెలికాప్టర్‌ను కేటాయించాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక హెలిప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నాం. 400 మంది ఇంజినీర్లు నిరంతరం విధుల్లో ఉంటారు. ఒక్కో సెక్టార్‌ అధికారి వెంట ఒక్కో ఇంజినీర్‌ అందుబాటులో ఉంటారు. నిజామాబాద్‌లో ఈనెల 9న రైతుల ర్యాలీకి అనుమతినిచ్చాం. రాష్ట్రంలో ఫొటో ఓటరు స్లిప్పులు, గుర్తింపు కార్డుల పంపిణీ 95శాతం పూర్తైంది. ఎన్నికల విధులకు మాజీ సైనికులను ఈసీ అనుమతించలేదు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించుకుంటాం. అదనపు కేంద్ర బలగాలను కోరాం.. అవసరాన్ని బట్టి కేటాయించే అవకాశం ఉంది. ఎన్నికల విధులకు ఎవరు ఆటంకం కలిగించినా చర్యలు ఉంటాయని రజత్‌కుమార్‌ హెచ్చరించారు.


మరిన్నీ తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/telengana/