నగరంలో సంభవించిన పేలుడు

The explosion
The explosion

హైదరాబాద్‌: నగరంలో పేలుడు సంభవించింది, మీర్‌పేట్‌లోని విజయపురి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త ఏరుకంటూ ఓ మహిళ చెత్తకుప్ప దగ్గరికి చేరుకుంది. అందులో ఉన్న డబ్బాను అందుకోబోయింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించగా, ఘటనాస్థలానికి చేరుకుని పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు. పేలుడు సంభవించిన డబ్బాను స్వాధీన పరచుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ మహిళను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/