నిపుణుల కమిటీ సీఎం జగన్‌ చెప్పినట్లే ఇచ్చింది

Bonda Umamaheswara Rao
Bonda Umamaheswara Rao

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అభివృద్దిపై సిఫారసులు చేయడానికి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం నియమించిన జీఎన్‌ రావు కమిటీ ఓ బోగస్‌ అని టిడిపి సీనియర్‌ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రాంతాల మధ్య విద్వేశాలు రెచ్చగోట్టేందుకే ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ చెప్పినట్లే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అమరావతిలో ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారికే భూములు ఉన్నాయన్న కారణంగా అమరావతిని అణగదొక్కడానికేకాక, టిడిపిని దెబ్బతీయడానికి ముందస్తు ప్రణాళికమేరకు జీఎన్‌ రావు కమిటీని నియమించదన్నారు. రాజధాని రైతుల చేపట్టిన ఆందోళనపై బొండా ఉమా ఈ రోజు మీడియాతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తున్నామంటే అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌మోహన్‌ రెడ్డి స్వాగతించారని తెలిపారు. ఇప్పుడేమో రాజధాని మార్పుపై వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాతున్నారు. రాజధాని రైతులకు తిరిగి భూములు ఇవ్వడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/