అవినీతి అంతం సాధ్యమేనా?

Corruption

అవినీతి, అభివృద్ధికలిసి పయనించలేవు.. అవినీతి పెరిగే కొద్దీ అభివృద్ధికి తూట్లు పడక తప్పదు. అభివృద్ధి ముందుకు నడిచే కొద్దీ అవినీతి వెనుకకు గుంజుతూ ఉంటుంది. కానీ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అవినీతి కూడా అక్కడే ఏదో ఒక రూపంలో ఉంటుంది. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిధులు వెచ్చించకపోతే అసలు అవి నీతి తలెత్తే ప్రసక్తే ఉండదు. కానీ ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రజాప్రభుత్వాలు అభివృద్ధివైపు అడుగులు వేయకుండా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా మనుగడ సాగించలేవ్ఞ.అవినీతిని అడ్డుకునేందుకు ప్రజా ధనాన్ని కాపాడేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

కానీ ఆశించిన ఫలితాలు లభించడం లేదు.అంతకంతకు అవినీతి పెరుగుతున్నదేతప్పఏమాత్రం తగ్గడం లేదు. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. అక్రమాలు జరిగాయని వారే నోటీసులు ఇవ్వడం,తర్వాత అవి సరిచేస్తాం,అంతా తమ చేతిలోనే ఉందని బెదిరించి, నమ్మించి లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు.ఇలా రకరకాల మార్గాలలో అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేందు కు అన్వేషణ నిరంతరం జరుగుతూనే ఉంది. తాజాగా గురువారం మేడ్చేల్‌ -మల్కాజ్‌గిరిజిల్లా పంచాయతీ అధి కారి ఏకంగా కార్యాలయంలోనే లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

గ్రామపంచాయతీలో గతంలో అవకతవకలు జరి గాయని,మాజీ సర్పంచ్‌తోపాటు సంబంధిత ఉద్యోగులకు జిల్లాపంచాయతీ అధికారి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ మాజీ సర్పంచ్‌ లబోదిబోమంటూ నోటీసులు ఇచ్చినజిల్లా పంచాయతీ అధికారి దగ్గరికి రావడంతో లెక్కలు సరి చేయడం తమచేతిలోనే ఉందని, అందుకు పదిహేను లక్షల రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చర్చోపచర్చల తర్వాత ఐదు లక్షలరూపాయలు ఇచ్చేందు కు ఒప్పందం కుదిరింది. విడతల వారీగా ఆ డబ్బు ఇచ్చే ఒప్పందంలో భాగంగా గురువారం లక్షరూపాయలు ఇచ్చే ముందుగానే ఆ మాజీసర్పంచ్‌ ఎసిబి అధికారులకు సమా చారమివ్వడంతో వల పన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.

ఎపిలో కర్నూలు జిల్లా గూడూరు తాహశీల్దార్‌ను శుక్రవారం 4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకుని, అరెస్టు చేశారు. ఇక హైదరా బాద్‌ నగరంలో పోలీసుదాడుల గురించిముందుగా సమా చారం ఇచ్చేందుకు పోలీసు ఉద్యోగులే కొందరు హుక్కా కేంద్ర నిర్వహకులతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం బయటకు వచ్చింది. పోలీసులు దాడులకు వచ్చేముందే ఈ సమాచారం ఆ కేంద్రాలకు అందించేందుకు నెలనెలా లంచాలు ఇచ్చేవిధంగా అంగీకారం కుదుర్చుకున్నారు. మొత్తంమీద ఎన్నేళ్ల నుంచి ఎన్నాళ్ల నుంచి జరుగుతుం దేమోకానీ ఈ విషయం హైదరాబాద్‌ పోలీసునగరకమిష నర్‌ దృష్టికి రావడంతో సమగ్ర విచారణ చేసి ఆరుగురు పోలీసు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు.

ఇలా రకరకాల మార్గాల్లో అవినీతి కొత్త పుంకాలు తొక్కుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కూడా అవినీతి విషయంలో ఆందోళనకరంగానే ఉంది. మొన్న టౌన్‌ప్లానింగ్‌ అధికారి ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు చేస్తేవందకోట్లరూపా యలకుపైగా ఆస్తులను గుర్తించారు.అవినీతిని నియంత్రిం చేందుకు ఒకపక్క ప్రయత్నాలు జరుగుతున్నా మరొక పక్క అంతకు రెట్టింపుస్థాయిలో అది పెరిగిపోతున్నది. గత ఆరు దశాబ్దాలకుపైగా అవినీతి నిరోధానికి గట్టి కృషే జరుగుతున్నది. ప్రత్యేకంగా 1962 జనవరి రెండో తేదీన అవినీతినిరోధక శాఖను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు.ఎన్నో చట్టాలుచేశారు. వేలాది మంది అధికారులను వలపన్ని పట్టుకున్నారు.మరెందరినో ఆదా యానికి మించిన ఆస్తులను కూడబెట్టినందుకు అరెస్టులు కూడా చేశారు.

జైళ్లకుపంపారు.ఆస్తులను రికవరీ చేశారు. అవినీతిని ఏ పరిస్థితిలో సహించేదిలేదని, ఉక్కుపాదంతో అణచివేస్తామని, అధికారంలో ఉన్నవారుప్రకటనలపై ప్రక టనలు గుప్పిస్తుంటారు.ఎన్ని చట్టాలుచేసినా,మరెన్నిహెచ్చ రికలు, ప్రకటనలు చేసినా, మరెంత మంది అధికారులను నియమించినా,ఎంతమందిపై చర్యలు తీసుకున్నా అవినీతి మాత్రం తగ్గడంలేదు.రోజురోజుకు విజృంభించిపోతున్నది.

ఇందుగలడు, అందులేడన్న సందేహంవలదన్నట్లుఅంతటా వ్యాపించిపోయింది. అవినీతి అధికారులకు భయంభక్తి లేకుండా బరితెగించిపోతున్నారు.ఇటీవల కాలంలోఇది మరీ శృతిమించిపోతున్నది.పరాకాష్ఠకు చేరిందన్నా తప్పు లేదు. అందుకు కారణం కష్టపడకుండా తెల్లవారేసరికి లక్ష్మీపుత్రులు కావాలనే దురాశ సమాజంలో పెరగడమే కావచ్చు.కీలక పదవ్ఞలు నిర్వహిస్తున్న కొందరు రాజకీయ నాయకులు,దళారులు ఈ దురాశకు అతీతులు కాకపోవ డంవల్లనే దాని దుష్ప్రభావాలు సమాజంపై పడుతున్నా యి.

వారి రాజకీయ అధికారం దాటి సమర్థులైన అధికారు లు సైతం నిస్సహాయంగా ఉండిపోతున్నారు. మూడో కంటికి తెలియకుండా జరుగుతున్న అవినీతిని పట్టుకోవ డం కష్టమైనా, వాటిని కూడా వలపన్ని, ఒక వ్యూహం ప్రకారం పట్టుకోగలుగుతున్నారు. కనుక బహాటంగా నిర్లజ్జగా జరుగుతున్న అవినీతిని పసిగట్టి పట్టుకోలేకపోవ డమనే ప్రశ్న ఉదయించదు.ఏశాఖలో, ఏస్థాయిలో అవి నీతి ఉందో ఎసిబి అధికారులకే కాదు ప్రజలకు కూడా తెలుసు.ఎలా అదుపు చేయాలో కూడా అధికారులకు తెలియందికాదు.కానీ రాజకీయజోక్యం వారిని స్వతంత్రంగా చట్టపరంగా వ్యవహరించనివ్వడం లేదు. ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతున్న తతంగమే. ఎంత అభివృద్ధి చేసినా, మరెన్ని పథకాలు ప్రకటించినా అవినీతి అదుపు చేయలేకపోతే వ్యర్థమనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com