ఎన్నికల కమిషన్‌ పనితీరే ప్రజాస్వామ్యానికి రక్షణ

పటిష్టమైన కార్యాచరణ అవసరం

Election Commission
Election Commission

ఎన్నికల జాబితా సవరణ అనేది నిరంతరం కొనసాగే చర్యగా కమిషన్‌ పలుమార్లు ప్రకటించింది. ఇందుకు అవసరమైన చర్యల్ని చేపట్టడానికి వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే భావితరాలకు బాటలు వేయాలంటే భారత ఎన్నికల కమిషన్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కమిషన్‌ పక్కాగా పకడ్బందీగా మరింత క్రియాశీలకంగా మారాల్సిన అవసరం ఉంది. ఎన్నికల నిర్వహణను ఒక యజ్ఞంలా నిర్వహించాలి.

ఎన్నికల కమిషన్‌ పనితీరే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది. ప్రజల కొరకు, ప్రజలచేత ఎన్నుకోబడే ప్రజాస్వామ్య భారతదేశం మనది.

దేశ పరిపాలన శాసించే ఎన్నికల ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగినది ఓటుహక్కు.

ప్రజాస్వా మ్యానికి ప్రభుత్వ ఏర్పాటుకు అత్యంత కీలకమైన ఎన్నికల విధానం మనదేశంలో అపహాస్యం పాలవు తోంది.

ఓటర్ల జాబితాలో చోటు చేసుకుంటున్న తప్పొప్పులు చిత్తశుద్ధిలేని అధికారుల తీరు, ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి.

అసలు మనదేశంలో ఎన్నికలు సజావుగా సాగుతున్నాయా? ఎన్నికల కమిషన్‌ తన విధులను సక్రమంగా నిర్వహిస్తుందా?ఇవిఎంలపై ఎందుకింత అనుమానాలు వస్తున్నాయి?..

మళ్లీ బ్యాలెట్‌ ప్రవేశపెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి? ఎన్నికల కమిషన్‌ ఈ విషయాలను స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

రాజ్యాగంలోని 326 ఆర్టికల్‌ ప్రకారం ప్రతి ఒక్కరికి పౌరుడైన భారతీయుడికి కుల, మత, వర్గ, వర్ణ, లింగ బేధం లేకుండా ఓటు హక్కు కల్పించారు.

ప్రపంచ దేశాలలో ఓటు ద్వారా క్రమక్రమంగా స్వేచ్ఛ సమానత్వం సాధించుకుంటే మనదేశంలో మాత్రం ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి.

రాజకీయాలను వ్యాపారంగా మార్చి ధనవంతులు, బడా వ్యాపారవేత్తలు మాత్రమే చట్ట సభల్లోకి అడుగుపెట్టి చట్టాలను తమకు లాభకరంగా మార్చుకుంటున్నాయి.

ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టామని ఓటర్లు నేరుగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడు ప్రకటించడం బాధాకరం.

మనదేశ భవిష్యత్‌కు అత్యంత కీలకమైన ఎన్నికల విధానం సక్రమంగా లేకపోవడం, 70 సంవత్సరాల గణతంత్ర భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ నేటికీ సజావుగా సాగకపోవడం శోచనీయం.

ఓటర్ల జాబితా సక్రమంగా ఉండదు. ప్రతి సంవత్స రం క్రమంతప్పకుండా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణప్రక్రియ సజావుగా ఉండదు.

ఈ ప్రక్రియలో కీలకమైన బూత్‌ లెవెల్‌ అధికారులు (బిఎల్‌ఓ) తమ బూత్‌ పరిధిలో ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలను వాస్తవ పరిస్థితులకను గుణంగా తనిఖీలు చేసి సవరించాల్సి ఉంటుంది.

ఇందుకుగాను వారికి ప్రత్యేకంగా పారి తోషికాలుకూడా చెల్లిస్తారు.

కాని విధుల నిర్వహ ణలో నిర్లక్ష్యం సమన్వయంతో పనిచేయకపోవ డం ఓటర్లజాబి తా నిరంతరం తప్పొప్పులతో ఉంటుంది. ఓటరు తాను నివాసం ఉంటున్న వార్డులోనే ఓటుహక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండాలి.

కాని ఒకే ఇంటిలో నాలుగు ఓట్లు ఉంటే నలుగురు నాలుగు బూత్‌లలో నమోదు అయ్యి ఉంటాయి. ఎన్నికల సమయంలో ఓటర్‌ స్లిప్పులను పంచాల్సిన అధికారులు సిబ్బంది తూతూ మంత్రంగా పనిచేస్తున్నారు.

ఓట్లు వేయడానికి ఆసక్తి చూపనివారు కొందరైతే ఎలాగైనా ఓటు వేద్దామని వచ్చే వారికి వారి బూత్‌ ఎక్కడ ఉందో తెలియదు. గంటల కొలది లైన్‌లో నిలబడినవారి ఓట్లు జాబితాలో ఉండవు.

వారిని ఆవేదనకు గురి చేసి చిత్రవిచిత్ర సంఘటనలు ఒక ప్రహసనంలా సాగే వ్యవహారం తో ఓటర్లు ఓటు వేయడానికి అనాసక్తి ప్రదర్శిస్తున్నారు.

ఓటర్ల జాబితా సవరణ దొంగ ఓట్ల తొలగింపు పేరిట లక్షలాది ఓటర్ల తొలగింపు జరుగుతున్నాయి.

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వెలుగు చూస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కోర్టు కేసులు, ఎన్నికల కమిషన్‌ వివరణలు, ప్రతిపక్షాల, ప్రజాస్వామ్య వాదుల ఆవేదనను ఆరోపణలుగా కొట్టిపారేయడం బాధగా ఉంది.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ముందు ఓటర్‌ జాబితా విషయం ఎన్నికల కమిషన్‌ తీరు ఏమాత్రం సరిగ్గా లేదు.

కోర్టులు కాని సంస్థలు కాని వ్యక్తులు రాజకీయ పార్టీలు ఎవరూ కూడా కమిషన్‌ను ప్రశ్నించే అధికారం లేదన్నట్లుగా వ్యవహరించడం సమంజసం కాదు.

ఇవిఎంల పనితీరుపైన వెల్లువెత్తుతున్న అనుమానాలు పోలింగ్‌ శాతం ప్రకటించడంలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు ఉన్న తేడాలు, వీటి విషయంలో వస్తున్న ఆరోపణలు,

సందేహాలను నివృత్తి చేయడంలో కమిషన్‌ ఎందుకు విఫలమవుతుందో అర్థం కావడం లేదు.

దొంగ ఓట్లను అరికట్టడంలో, ఎన్నికలలో జరిగే అక్రమాలను అడ్డుకోవడంలో, సక్రమ మైన ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల కమిషన్‌ పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి.

అందుకు అవసరమైన యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. ఎన్నికల జాబితా సవరణ అనేది నిరంతరం కొనసాగే చర్యగా కమిషన్‌ పలుమార్లు ప్రకటించింది.

ఇందుకు అవసరమైన చర్యల్ని చేపట్టడానికి వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా సవరణ- ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన- ఎన్నికల నిర్వహణ-ఫలితాల ప్రకటన ఈ విధులన్నీ పనిచేయడానికి కార్యాచరణ రూపొందించుకోవాల్సి న అవసరం ఉంది.

భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టా లంటే భావితరాలకు బాటలు వేయాలంటే భారత ఎన్నికల కమిషన్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

కమిషన్‌ పక్కాగా పకడ్బందీగా మరింత క్రియాశీలకంగా మారాల్సిన అవసరం ఉంది. ఎన్నికల నిర్వహణను ఒక యజ్ఞ్ఞంలా నిర్వహించాలి.

ఎన్నికల కమిషన్‌ పనితీరే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతుంది.

  • సురేష్‌ కాలేరు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/