ఆర్థిక వ్యవస్థ ఆరునెలల్లోనే నాశనం

“భారత్‌ బచావో” ర్యాలీలో చిదంబరం

Chidambaram
Chidambaram

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుకరిస్తున్న ఆర్థిక విధివిధానలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం దేశ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పడం సరికాదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే నాశనం చేసిందని, ఈ సమస్యకు మంత్రుల వద్ద ఎలాంటి పరిష్కారం లేదని చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ బచావో ర్యాలీకి పిలుపునిచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా బాగానే ఉంది అని వ్యాఖ్యానించారు, కానీ అచ్చేదిన్‌ త్వరలోనే వస్తుందన్న విషయం మాత్రం ఆమె తెలుపలేదు అంటూ చిదంబరం ఆమెను విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/