అభిమానులకు జ్ఞానాన్ని పంచుతున్న సెహ్వాగ్‌

నిజానికి, అబద్ధానికి ఉన్న తేడా ఇదేనంటూ ఫన్నీ కామెంట్స్‌

Virender Sehwag
Virender Sehwag

ముంబయి: టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిమానులకు జ్ఞానాన్ని పంచుతున్నారు. ఆయన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడూ సరదాగా అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ప్రతీసారి ఎదో ఒక విషయాన్ని చెపుతూనే ఉంటారు. ఆయన చేసే వ్యాఖ్యలు ఎంతో ఆకట్టుకునేలా ఉంటాయి. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులకు జ్ఞానాన్ని పంచే ప్రయత్నాన్ని సెహ్వాగ్ చేశాడు. నిజానికి, అబద్ధానికి మధ్య ఉన్న తేడా ఏంటో వివరించాడు. నిజమంటే డెబిట్ కార్డు వంటిదని, అబద్ధమంటే క్రెడిట్ కార్డు వంటిదని చెప్పారు. డెబిట్ కార్డు అంటే ఇప్పుడు డబ్బులు చెల్లించి తర్వాత ఎంజాయ్ చేయడమని… క్రెడిట్ కార్డ్ అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసి తర్వాత డబ్బులు చెల్లించడమని అన్నారు.

https://www.instagram.com/p/B8Qd0eLA_vQ/

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/