పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం కావాలి!

పాలకులు ఆదిశగా పయనించాలి

The development of the poor should be the goal of the government!
The development of the poor should be the goal of the government!

ప్రత్యేకంగా ఉత్పత్తి రంగానికి చెందిన వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోవడానికి అనేక కారణాలున్నాయి.

అందులో ముఖ్యంగా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తే ఉత్పత్తి రంగాన్ని మరిచి మరొక రంగాన్ని ఎంచుకుంటే సమాజమనుగడకు కష్టమవుతుందని మేధావులు ఇలా ఆలోచిస్తున్నారా? అనే అనుమానం కలిగినా ఆశ్చర్యబోనక్కర్లేదు.

ఏ ప్రభుత్వమైనా పేదలకోసం ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారు? అని పత్రాలలో లెక్కలు చూపకుండా క్షేత్రస్థాయిలో ఎంతమంది నిరుపేదలకు ఆర్థికంగా ఉపయోగపడ్డామో పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేదొడికి మేలు జరిగే పాలనను కొనసాగించాలి.
మా టల్లో చెప్పడం చాలా తేలిక.

కానీ ఆచరణలో సాధ్యం కానీ ఎన్నో విషయాలు, సంఘటనలు ఉంటాయి. ఎంతో మంది మేధావులు, మానసిక నిపుణులు ప్రేరణాత్మకమైన ఉపన్యాసాలిచ్చే నైపుణ్యం కలిగినవారు ఇతరులను అనగా వివిధ సమస్యలతో అల్లాడుతున్న వారికి, వారి సందేశాల ద్వారా అంతోఇంతో ఉపశమనం కలిగిస్తారే తప్పా కొన్ని సందర్భాల్లో అవి కూడా పనిచేయవని అందరికి తెలిసిన విషయమే.

భారతదేశానికి స్వాతంత్య్రం మునుపు ప్రజలు ఎన్ని ఇక్కట్లపాలయ్యారో చరిత్ర చెబుతుంది. స్వాతంత్య్రానికి ఐదు సంవత్సరాల ముందు ఆకలి చావులతో దాదాపు 40 లక్షల మంది అసులువ్ఞబాసిన విషయా న్ని తలుచుకుంటే మనదేశంలో ఎంత పేదరికం ఉన్నదో తెలియక మానదు.

స్వాతంత్య్రం అనంతరం ప్రభుత్వం ఎన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలు రూపొందించినా వాటి అమలులో అవినీతి ప్రత్యేకపాత్ర వహించి, వాటి అమలు ఏ మేరలో జరిగిందో, జరుగుతుందో అందరికి తెలిసిన విషయమే.

ఎన్ని ప్రభుత్వాలు మారినా, మరెన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా అవి కేవలం లెక్కలకే పరిమితమవ్ఞతున్నాయి తప్పా క్షేత్రస్థాయిలో అను కున్నంతగా పేదవారికి బాసటగా నిల్వలేకపోతున్నాయనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.

భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని హక్కులు కల్పించినా, సవరణకు పార్లమెటుకు అనుమతించినా కూడా పరిణామక్రమంలో వస్తున్న పరివర్తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

కానీ ఒక్క ‘జీవించే హక్కుకు దేశంలో ఎంతో ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వాలు స్వాతంత్య్రం సము పార్జించాక ఎంతో కృషి చేసినా నిమ్న, మధ్యతరగతి, పేద కుటుంబాలకు మాత్రం అనుకున్నంత స్థాయిలో మేలు చేయలేక పోతున్నారన్నది అక్షరాల నూటికి నూరుశాతం నమ్మకతప్పని పరిస్థితి.

నిజనిర్ధారణ కావాలంటే కమిటీలువేసి విభిన్నరంగాల్లో అధ్యయన, పరిశోధన గావిస్తే ప్రజల కష్టాలు, ఆర్తనాదాలు ఏంటో కళ్లకు తీడ్రీల్లో కన్పిస్తాయి. మారుతున్న పరిణామక్రమంలో ఫెస్టిసైడ్స్‌, ఫర్టిలైజర్‌, హైబ్రీడ్‌ విత్తనాలు, వివిధ రసాయనాలు వాడకుండా ఎలాంటి ఆహారపదార్థాలు పండించలేని పరిస్థితి దాపురించింది.

దానికనుగుణంగా మార్కెట్‌లలో లభించే ప్రతి ఆహారపదార్థం వివిధ రసాయనాలతో కూడుకొని ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. వాటిని భుజించిన ప్రతివారు పలు అనారోగ్యాల బారినపడుతున్నారన్నది జగమెరిగిన సత్యం.

గతంలో ఎలాంటి అనారోగ్యాల బారినపడకుండా ఆడవాళ్లు ఎలాంటి సర్జరీలు లేకుండా అరడజనుకుపైగా పిల్లలకు జన్మనిచ్చి ఆరోగ్యంగా ఉన్న పరిస్థితులు తెలియనివికావు.

ఇప్పుడున్న పరి స్థితులలో ఆడవాళ్లు ఒకరిద్దరికి జన్మనివ్వాలంటే సర్జరీలతో నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. గతంతో పోలిస్తే ఎలాంటి ఖర్చులు లేకుండా పుట్టిన పిల్లలకు వారి విద్యాబుద్ధులకు, అలనాపాలనకై కొంత ఖర్చు చేయాలంటే ఎంతో ఆలోచించేవారు.

మరి నేడున్న పరిస్థితుల్లో కడుపులోపడిన పసికూన నుండి 10ఏళ్లు వచ్చేవరకు పెంచాలంటే లక్షలలో ఖర్చు చేయాల్సిందే. వారి చదువుల గురించి పాఠశాలలో చెల్లించే ఫీజుల గురించి ఆలోచిస్తే సగటు మానవ్ఞనికి కత్తిమీద సాముగా మారిందనడంలో ఎలాంటి ఆశ్చర్యమక్కర్లేదు.

డబ్బులున్నవారికి ఇది పెద్ద సమస్యగా కనబడక పోయినా పేదవారికి మాత్రం తట్టుకోలేని సమస్య అనిచెప్పడంలో ఎలాంటి అవాస్తవంలేదు.

ఎందుకంటే ఇది ఒక పేదరికంతో ముడిపడకుండా మారుతున్న కాలక్రమేణలో భాగంగా సంభవి స్తున్న విప్లవాత్మకమైన మార్పులు కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో వచ్చిన మార్పులు, గతంతో పోలిస్తే ఎలాంటి ఉపయోగకరంగా లేవన్నది సగటు పేదవారికే తెలుస్తున్నది.

రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నో వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసు కున్నా దేశ జనాభాలో ఆర్థికంగా అట్టడుగు స్థానాలలోనున్న ప్రజలకు ఏరీతిలో ఉపయోగపడుతున్నాయే ప్రతి ఒక్కరు ఆలో చించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ప్రస్తుతం సమాజంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కాస్తా డబ్బుండి జ్ఞాన మున్న వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. కానీ పేదోడి బతుకుకు భరోసానివ్వలేని పరిస్థితిని సమాజంలో చూడవచ్చు.

ప్రత్యేకంగా ఉత్పత్తి రంగానికి చెందిన వారి ఆర్థిక పరిస్థితి మెరు గుపడకపోవడానికి అనేక కారణాలున్నాయి.

అందులో ముఖ్యంగా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తే ఉత్పత్తి రంగాన్ని మరిచి మరొక రంగాన్ని ఎంచుకుంటే సమాజమనుగడకు కష్టమవ్ఞతుందని మేధావులు ఇలా ఆలోచిస్తున్నారా?

అనే అనుమానం కలిగినా ఆశ్చర్య బోనక్కర్లేదు.ఏ ప్రభుత్వమైనా పేదలకోసం ఎన్నిసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారు? అని పత్రాలలో లెక్కలు చూపకుండా క్షేత్రస్థాయిలో ఎంతమంది నిరు పేదలకు ఆర్థికంగా ఉపయోగపడ్డామో పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేదొడికి మేలు జరిగే పాలనను కొనసాగించాలి.

  • డా.పోలం సైదులు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/