వాయిదా పడిన ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌

fifa world cup
fifa world cup

న్యూఢిల్లీ: కరోనా కారణంగా మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ వాయిదా పడింది. ఈ ఏడాది భారత్‌ వేదికగా నవంబర్‌లో జరగాల్సిన, ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యుల్‌ ప్రకారం నవంబర్‌ 2 నుంచి 21 వరకు జరగాల్సిన ఈ టోర్నీ వాయిదా పడింది, తిరిగి ఈ టోర్నిని ఎపుడు నిర్వహిస్తారనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే టోర్నీ నిర్వహించే తేదీలను వెల్లడిస్తామని ఫిఫా పేర్కోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/